సోషల్ మీడియోలో రచ్చ చేస్తున్న మరో పెళ్లి కూతురు..!

సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్​ అవుతుందో ఎవరు ఊహించ లేరు. మనం చూసి ఈ వీడియోకి అంత సినిమా ఉందా అని అనుకున్నవి కూడా చాలా మందిని ఆకట్టుకుంటాయి. ఆ వీడియోలకు కూడా భారీ సంఖ్యలో వ్యూవ్స్ వస్తాయి. వీటిని సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు కూడా చూసి ఓ రేంజ్లో షేర్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా వాటి మీద లైకుల వర్షం కురిపిస్తుంటారు. మరికొందరైతే వారు చూసిన వీడియో నచ్చితే విచ్చలవిడిగా కామెంట్లు చేస్తుంటారు. ఇటువంటి వీడియోనే ఇప్పుడు ఒకటిసామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది.

Bride Bhangra Dance gone viral
Bride Bhangra Dance gone viral

గతంలో బుల్లెట్ బండి పాటకి డాన్స్ వేసిన ఓ పెళ్లి కూతురు సామాజిక మాధ్యమాల్లో ఎంత ఫేమస్​ అయిందో తెలుసు కదా… అయితే అలాంటి వీడియోనే ఇప్పుడూ ఇంకొకటి పుట్టుకొచ్చింది. పెళ్లి తర్వాత జరిగే బరాత్ కార్యక్రమంలో ఓ నవవధువు తన భర్త తో పాటు తన దైన శైలి లో స్టెప్పులేసి అందరి చేతా వారెవ్వా అనిపిస్తుంది. ఈ నవ వధువు వేసిన స్టెప్పులకు ఇన్​స్టాగ్రామంలో యువత అంతా ఫిదా అయ్యారు. అయితే ఆ కొత్త పెళ్లి కూతురు స్టెప్పులు వేసింది తెలుగు పాటకు కాదు. అది బాంగ్రా పాట. దానికి వారు వేసిన స్టెప్పులు చాలా మందిని ఆకట్టుకున్నాయి.

https://www.instagram.com/reel/CaANSULgUaG/?utm_source=ig_embed&ig_rid=af5fcd96-062d-4207-83ea-e626ef9eaad5

బాంగ్రా పాటకు డ్యాన్స్ వేసిన నవ వధువు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఈ వీడియోకు ఇప్పటికే 30 లక్షల మంది చూశారు. అంతేగాకుండా సుమారు లక్షకు పైగా లైకులు కూడా వచ్చాయి. ఒంటి మీద బంగారంతో పాటు బంగారం రంగు లెహంగా వేసుకుని యువతి వేసిన స్టెప్పులు యవకుల గుండె పిండేసేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *