గిరా గిరా తిరిగే ఫ్యాన్​ ను ఒక్క చేతితో ఆపాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

సోషల్​ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. వర్క్ అయితే అంతా బాగుంటుంది. కానీ లేకపోతే మొదటికే మోసం వస్తుంది. వైరల్ అయ్యేందుకు చేసిన వీడియోల్లో కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా వున్నాయి. అయితే వారు వైరల్ అవ్వడానికి ఆ వీడియోలు చేస్తే… వారు ప్రాణాలు కోల్పోయిన తరువాత కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ప్రమాదకరమైన వీడియోలు చేయెద్దని నిపుణులు సూచిస్తున్నారు.

boy stopped fan with one hand
boy stopped fan with one hand

అయితే ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో ఓ యువకుడు గిరా గిరా తిరుగుతున్న ఓ ఫ్యాన్ ను ఒక్క చేతితో వెంటనే ఆపేశాడు. ముందుగా ఓ మంచం మీదకు ఎక్కి ఫ్యాన్ స్పీడును గమనించాడు. వేగాన్ని ఓ సారి అంచనా వేసుకుని పట్టు పట్టాడు. సరిగ్గా పట్టు బిగించి తన పిడికిలితో ఒక్కసారిగా ఫ్యాన్​ రెక్కను ఆపేశాడు. దీనిని సోషల్​ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది.

మనలో ఉన్న ట్యాలెంట్ ను చూపించుకోవడం కోసం సోషల్​ మీడియా ఓ వేదిక అవ్వాలి కానీ… ఇలాంటి ప్రమాదకర ఫీట్లు చేసి వైరల్​ అవ్వడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు తగినంత జాగ్రత్ వహించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే క్షణాల్లో మనం ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఈ కుర్రాడు చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు సుమారు పది లక్షల మంది పైనే చూశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *