బుర్ఖా తో సినిమా థియేటర్ కి వచ్చిన సందడి చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

సాధారణంగా సినీ ఇండస్ట్రీకీ చెందిన నటినటులు తమ నటనను కనబరిచడానికై ఎంతో కష్టపడుతుంటారు. అంత కష్ట పడేది ప్రేక్షకులను మెప్పించడానికే కాబట్టి వారి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది స్వయంగా తెలుసుకోవడానికి కొంత మంది నటులు ఏకంగా మారువేశంలో థియేటర్స్ కు వెళ్లి అక్కడ వచ్చే విజిల్స్, కామెంట్స్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అందుకే హీరోయిన్ సాయి పల్లవి బహుశా అదే టేస్ట్ కోరుకుందేమో.. ఇటీవలే వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరో నాని సరసన నటించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ప్రేమమ్ సినిమాతో మలయాళ సినీ రంగంలో అడుగు పెట్టి తొలి నటనతో యూత్ ను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీతో ప్రేక్షకులను మరింత ఫిదా చేసి ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.

ఆ తరువాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది. ఇక ఇటీవలే ఈమె నటించిన సినిమాకు స్వయంగా రెస్పాన్స్ తెలుసుకోవడానికి బుర్ఖా వేసుకొని దర్శకుడు రాహుల్ తో పాటు హైదరాబాద్ మూసాపేట్ లో శ్రీరాములు థియేటర్ కు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సాయి పల్లవి సర్ ప్రైజ్ విజిట్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్ టైన్మెంట్ లో సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా లో పంచుకుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *