లిప్‌ లాక్‌ సీన్లపై ప్రభాస్‌ వైరల్‌ కామెంట్స్‌..!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న లెటెస్ట్‌ మూవీ రాధేశ్యాం. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యంగ్‌ టాలెంటెడ్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో తెరకెక్కతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే న‌టిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Prabhas comments on liplock with pooja hegde

కాగా ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌లో పూజాహెగ్డేతో కలిసి కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడంపై ప్రభాస్‌ స్పందించాడు. ముద్దు సీన్లు చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపించిందన్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్. ‘‘ కమర్షియల్‌ సినిమాలో అయితే రొమాంటిక్‌ సన్నివేశాలు వద్దనుకుంటే.. చెప్పి తీసేపించచ్చు. కానీ, ఇలాంటి ప్రేమకథా చిత్రాలకు అది కుదరని పని. ముద్దు సన్నివేశాలు ఒక్కటే కాదు.. సెట్‌లో ఉన్న వాళ్లందరి ముందు చొక్కా లేకుండా నటించాలంటే ఇప్పటికీ ఇబ్బందిగానే ఉంటుంది. షర్ట్‌ లెస్‌ సీన్లు ఉన్నప్పుడు సెట్‌లో మొత్తం ఎంతమంది ఉన్నారా? అని చెక్‌ చేసుకుంటా. అక్కడ చాలా మంది ఉంటే.. దర్శకుడితో మాట్లాడి ఆ సీన్ల వరకూ వేరే ఎక్కడైనా షూట్‌ చేయమని అడుగుతా’’ అని ప్రభాస్‌ తెలిపారు. కాగా ప్రభాస్‌ ఫస్ట్‌ టైమ్‌ రొమాంటిక్‌ సీన్లపై స్పందించటంతో ఈ కామెంట్స్‌  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Prabhas comments on liplock with pooja hegde

ప్ర‌భాస్ లిప్ లాక్ సీన్‌లో న‌టించ‌డం ‘రాధేశ్యామ్‌’లోనే కాదు.. అంత‌కు ముందు ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘సాహో’లోనూ శ్ర‌ద్ధాక‌పూర్‌తో లిప్ లాక్ సీన్ ఉంటుంది. అయితే పూర్తి స్థాయి రొమాంటిక్ సీన్‌లో న‌టిస్తూ లిప్ లాక్ సీన్‌లో న‌టించ‌డం అనేది ప్ర‌భాస్‌కు కొత్తే. మ‌రి పీరియాడిక్ ల‌వ్ స్టోరి ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలియాలంటే మార్చి 11 వ‌ర‌కు ఆగాల్సిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *