రైతులకు మేలు చేయడంలో దేశంతో పోటీ : సీఎం జగన్

15.61లక్షల మంది రైతులకు రూ.2977.92 కోట్ల బీమా సొమ్మును అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా అని, దేవుడి దయ వల్ల నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. సోమవారం సత్యసాయి జిల్లాలో బీమా సొమ్ము పంపిణీ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘‘బీమా పరిహారంగా రూ.2977.82 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. పంటలబీమా పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చాం. గత చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో పంటల బీమాకు రూ.3411 కోట్లు ఇచ్చారు.

ఇప్పుడు మూడేళ్లలో పంటల బీమా కింద రూ.6684.84 కోట్లు చెల్లించాం. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి గల తేడాను ప్రజలు గమనించాలి. రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నాం. మన రాష్ట్రంలో జరుగుతున్న మార్పులను పక్క రాష్ట్రాలు వచ్చి చూస్తున్నాయి. రైతు భరోసా పథకం కింద రూ.23,875 కోట్లు చెల్లించాం. రైతన్నల కోసం మూడేళ్లలో రూ.1,27,823 కోట్లు ఖర్చు చేశాం – పంటల బీమా పథకం కింద 44.28 లక్షల మంది రైతులకు రూ.6684.84 కోట్లు చెల్లించాం.

ఏ సీజన్ లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్ పుట్ సబ్సిడీ. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది – ఆర్బీకేలు రైతన్న చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. పంటల బీమా పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పట్టాదార్ పాస్ పుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్కరికి పరిహారం రాలేదని నిరూపించలేకపోయారు. టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న వారికి మేమే పరిహారం చెల్లించాం. ఆరోజు దత్తపుత్రుడికి గుర్తురాలేదు, ఇవ్వాలనే తపన చంద్రబాబుకు లేదు’’అని అన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *