సిద్ధమైన మంత్రివర్గ జాబితా..బోరున ఏడ్చిన కోటంరెడ్డి..!

ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ జాబితా సిద్ధమైంది. 25 మందితో కొత్త మంత్రివర్గాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. రేపు ఈ కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.  అయితే పదవులు దక్కని పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మాచర్లలో పిన్నెల్లి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. తన ఇంటికి ఎవరూ రావద్దని కార్యకర్తలకు చెప్పారు. మాచర్లలో వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బోరున ఏడ్చారు. కాకాణిని తనే పార్టీలోకి తీసుకొచ్చానని అన్నారు. కాకాణికి పదవి ఇచ్చి, తనకు ఇవ్వలేదని మీడియా ఎదుటే కన్నీళ్లు కార్చారు. అదే అసంతృప్తి బాటలో బాలినేని, తిప్పేస్వామి ఉన్నారు. బాలినేనితో తిప్పేస్వామి సమావేశమయ్యారు. మొదట కేబినెట్ లిస్ట్ లో తిప్పేస్వామి పేరు ఉండగా చివరి నిమిషంలో ఆదిమూలపు సురేష్‍కు చోటు  కల్పించారు.

తిప్పేస్వామికి మంత్రిపదవి కోసం బాలినేని ప్రయత్నించినా ఫలించలేదు.  అయితే పదవుల దక్కిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.  ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం), సీదిరి అప్పలరాజు(పలాస), బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి), పీడిక రాజన్నదొర(సాలూరు), గుడివాడ అమర్నాథ్(అనకాపల్లి), బూడి ముత్యాలనాయుడు(మాడుగుల), దాడిశెట్టి రాజా(తుని), పినిపే విశ్వరూప్(అమలాపురం), కారుమూరి వెంకట నాగేశ్వరావు(తణుకు), తానేటి వనిత(కొవ్వూరు), కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగుడెం), జోగి రమేష్(పెడన), అంబటి రాంబాబు(సత్తెనపల్లి), మేరుగ నాగార్జున(వేమూరు) ఉన్నారు.

విడుదల రజిని(చిలకలూరిపేట), కాకాణిగోవర్ధన్ రెడ్డి(సర్వేపల్లి), అంజాద్ బాషా(కడప), బుగ్గనరాజేంద్రనాథ్రెకడ్డి(డోన్), గుమ్మనూరు జయరాం(ఆలూరు), పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి(పుంగనూరు), నారాయణస్వామి(గంగాధరనెల్లూరు), ఆర్కే రోజా(నగిరి), ఉషా శ్రీ చరణ్(కళ్యాణదుర్గం), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(రామచంద్రాపురం), తిప్పేస్వామి(మడకశిర)లు ఎంపిక అయ్యారు. ఎవరికి ఏ పదవి కట్టబెట్టారో రేపు తెలియనుంది. వీరి ప్రమాణస్వీకారానికి సచివాలయం వద్ద ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. రేపు శ్రీ రాముడు పట్టాభిషేకం సందర్భంగా మంచి ముహూర్తం అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రమాణస్వీకార తేదీన ఖరారు చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *