రుయా ఘ‌ట‌న‌పై మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆగ్ర‌హం

తిరుప‌తి రుయా ఘ‌ట‌న‌పై వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. రుయా సూప‌రింటెండెంట్‌కు షోకాజ్‌ నోటీస్ ఇచ్చినట్లు ప్రకటించారు.  ఆర్ఎంవోను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.  స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మ‌హా ప్ర‌స్థానం వాహ‌నాలు రాత్రిళ్లు కూడా ప‌నిచేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామని తెలిపారు. ప్రీపెయిడ్ ట్యాక్సీల విష‌యాన్ని ప‌రిశీలిస్తామన్నారు. ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో మెరుగైన సేవ‌ల్ని అందించాల‌నే ల‌క్ష్యంతో సిఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముందుకెళ్తున్నారని అన్నారు. ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో  ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవువన్నారు.

తిరుప‌తి రుయా ఘ‌ట‌నను  ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోందని అన్నారు.  రుయా ఘ‌ట‌న‌పై ప్రాథ‌మిక విచార‌ణకు ఆదేశించామన్నారు. ఇంకా బాధ్యులెవ‌రున్నారన్నది పూర్తి స్థాయి విచార‌ణ త‌ర్వాత తెలుస్తుందన్నారు. బాధ్యులంద‌రిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. తిరుపతిలో జ‌రిగిన ఘ‌ట‌న అత్యంత అమాన‌వీయ‌మ‌ని అన్నారు.   ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూస్తామని, పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని  ఉన్నతాధికారుల‌కు ఆదేశించామన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఎవ‌రైనా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామని హెచ్చరించారు.

పోలీసు శాఖ త‌ర‌ఫున కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని తెలిపారు. అయితే సోమవారం ఓ బాలుడు తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చనిపోయారు. దీంతో అతన్ని తీసుకెళ్లడానికి ప్రభుత్వ అంబులెన్సులు వచ్చే అవకాశం లేదని చెప్పడంతో సుమారు 90 కి.మీ బైక్ పై తీసుకెళ్లారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరినీ ఆ వీడియో కలచి వేసింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో స్పందించిన మంత్రి విడదల రజినీ ఇప్పటికే కొందిరపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *