జాతీయ జెండాపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!

కర్ణాటకకు చెందిన ఓ భాజపా మంత్రి జాతీయ జెండాపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత దేశ జాతీయ జెండా మారబోతుందని కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ ఇష్యూకు సంబంధించి మాట్లాడిని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం అతి త్వరలోనే ఇప్పడు ఉన్న త్రివర్ణ పతాకాన్ని కాస్తా కేవలం కాషాయ జెండాగా మార్చేస్తామని అన్నారు. ఆ సత్తా భాజపాకు ఉందని తాను నమ్ముతున్నట్ల తెలిపారు. దీనితో పాటు హిందుత్వ భావ జాలాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయబోతున్నామని చెప్పకనే చెప్పారు.

గతంలో కూడా చాలా మంది రామ మందిరానికి సంబంధించి లోకువగా మాట్లాడారని అన్నారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చెప్పట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇదే విధంగా భాజపా సర్కార్​ జాతీయ జెండాగా కాషాయ జెండాను తీసుకురావడం తో పాటుగా ఏకంగా దిల్లీలోని ఎర్రకోటపై ఎగురువేస్తామని చెప్పారు. తమ మాటలను తేలికగా తీసుకోవద్దు అని గత అనుభవాలను గుర్తు చేశారు ఈశ్వరప్ప.

ఈయన చేసిన వ్యాఖ్యలపై లౌకిక వాదులు మండి పడుతున్నారు. ఓ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అమానుషం అని చెప్తున్నారు. రాజ్యాంగబద్ద హోదాలో ఉండి కూడా ఇలాంటి మాటలను మాట్లాడడం తప్పు అని అంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉండే కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంపై రచ్చ నడుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కానీ దేశ వ్యాప్తంగా ముస్లిం వర్సెస్ భాజపాగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *