మూడో విడత పోలింగ్ పూర్తి.. అఖిలేష్ యాదవ్ పై కేసు నమోదు..!

సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ లో మూడో విడత పోలింగ్ లో ఆదివారం ఆయన ఓటింగ్ లో పాల్గొన్నారు. అభినవ్ స్కూల్ సైఫాయి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చిన అఖిలేష్ మీడియాతో మాట్లాడారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ శృతిసింగ్ తెలిపారు.

ఈ విషయంపై సర్కిల్ అధికారి విచారణకు ఆదేశించామని శృతి సింగ్‌ పేర్కొన్నారు. విచారణ అనంతరం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద కేసును పరిగణిస్తూ సైఫాయి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.  పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ ఇటావా జిల్లాలో సొంతూరులోని సైఫాయ్‌లో ఓటు వేశారు. వీల్ చైర్‌లో పోలింగ్ కేంద్రానికి ములాయాం వచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 16 జిల్లాల్లో 59 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. 16 జిల్లాల్లో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 59 స్థానాలకు గాను మొత్తం 627 మంది పోటీలో ఉన్నారు. వీరందరి భవితవ్యం పోలింగ్ మిషన్లలో దాగి ఉంది. ఎవరి భవిష్యత్ ఏంటో ఫలితాల నాడు తేలనుండి. అయితే గెలుపై బీజేపీ, సమాజ్ వాదీ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు  ఈ సారి గెలుపు తమదేనని మాయావతి అంటున్నారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా..? లేక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందో చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *