టీడీపీలో చేరనున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.?

శాప్ చైర్మన్, కర్నూలు జిల్లా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు ఒక్క సారిగా గుప్పుమన్నాయి. దీంతో వైసీపీ శిభిరంలో కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా సిద్ధార్థ రెడ్డి సైలెంటుగా ఉంటూ వస్తున్నారు. పెద్దగా ఆర్భాటాలకు, పార్టీ కార్యక్రమాల్లో విరివిరిగా పాల్గొనడం లేదు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తో సిద్ధార్థ రెడ్డికి మొదటి నుండి విభేధాలు ఉన్నాయి. గతంలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఇది కాస్తా వైసీపీ పెద్దల వరకు పంచాయితీ వెళ్లింది. ఎమ్మెల్యేగా ఉన్న తాను కాదని, బైరెడ్డి పెత్తనం చేయడాన్ని ఆర్థర్ మొదటి నుండి జీర్ణించుకోలేకపోతున్నారు.

నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా సిద్ధార్థరెడ్డి పాల్గొంటున్నారు. ఇవి ఇంకా వారిద్ధరి మధ్య విభేధాలకు ఆజ్యం పోస్తోంది. తర్వాతి క్రమాల్లో నియోజకవర్గంలో సంబంధం లేకుండా ఉండేలా సిద్ధార్థ రెడ్డికి శాప్ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు. అయినా తన జోక్యాన్ని బైరెడ్డి తగ్గించుకోవడం లేదు. దీంతో ఆర్థర్ తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే బైరెడ్డి పార్టీ మారతారని ప్రచారాం జోరుగా సాగుతోంది.

కొన్ని రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రహస్యంగా సిద్ధార్థ రెడ్డి కలిశారని వైసీపీ అధిష్టానం దృష్టికి ఆర్థర్ వర్గం ఫిర్యాదు చేసింది. అయితే ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది సిద్ధార్థరెడ్డి వర్గం. శాప్ ఛైర్మన్ గా విధులు నిర్వర్తిస్తున్న బైరెడ్డికి పార్టీ మారాల్సిన అవసరం లేదని, కావాలనే ప్రత్యర్థి వర్గం బైరెడ్డి క్యారెక్టర్ ను కించపరిచేందుకు కుట్రలు చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సిద్ధార్థ రెడ్డి లోకేష్ ను కలిశారా లేదా అన్నది స్వయంగా ఆయన చెప్తేగాని తేటతెల్లం కాదని విశ్లేషకులు చెప్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *