నాటు నాటు పాటకు పెళ్లి కూతురు డ్యాన్స్.. తగ్గేదేలే..!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులోని పాటలు అద్భుతం ఉండడం వల్ల చాలా చాలా మందిని ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచిన పాటలల్లో ఒకటి నాటు నాటు అనే పాట. దీనిలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పోటాపోటీగా కలసి డ్యాన్స్ వేస్తారు. అయితే వీరు వేసే స్టెప్పుల్లు చాలా బాగా ఫేమస్ అయ్యాయి. దీంతో చాలా మంది వాటిని ట్రై చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ పెళ్లి కూతురు కూడా స్టేజ్ పైన నాటు నాటు పాటకు స్టెప్పులు వేసి దుమ్ము రేపింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

bride dancing for naatu naatu song in rrr
bride dancing for naatu naatu song in rrr

ఈ వీడియోలో ఉన్న దాని ప్రకారం.. ఓ పెళ్లి కూతురు తనతో పాటు ఉన్న మరి కొందరు అమ్మాయిలతో ఈ పాటకు స్టెప్పులు వేసింది. పెళ్లి బట్టల్లో ఉన్నా కానీ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఫుల్ ఎనర్జీతో ఆ పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియోను షేక్ చేస్తుంది. కేవలం పెళ్లి కూతురు వేసిన స్టెప్పులు మాత్రమే కాకుండా… పక్కన ఉన్న అమ్మాయిలు కూడా ఇరగ తీయడం విశేషం.

ఆ సినిమాలో చెర్రీ, తారక్ వేసిన స్టెప్పులతో ఏ మాత్రం తీసి పోకుండా ఈ పెళ్లి బృందం డ్యాన్స్ చేసింది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఈ వీడియో చూసిన వారు చాలా మంది ఓ రేంజ్ లో షేర్ చేస్తున్నారు. కామెంట్లు కూడా చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *