ఇదేందయ్యా.. కడుపులోకి చాయ్ గ్లాస్ ఎలా వచ్చింది?
చిన్న పిల్లలు పిన్నులు, చిల్లర కాయిన్లు, బలపం, చాక్ పీస్ ముక్కలు మింగిన ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఓ పెద్దాయన… అది కూడా చాయ్ గ్లాస్ ను మింగారు.. 55 ఏళ్ల వ్యక్తి కడుపులో ఓ చాయ్ గ్లాస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అందుకు సంబంధించిన ఎక్స్ రే ఫొటోలు కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఈ ఘటన బిహార్ లోని ముజఫర్ జిల్లాలో జరిగింది. ఆ పెద్దాయన కడుపులోకి చాయ్ గ్లాస్ ఎలా చేరిందో తెలుసా?
తీవ్రమైన కడుపు నొప్పి వస్తోందని ఆ వ్యక్తి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఎక్స్ రే తీయగా… ఆయన కడుపులో ఏకంగా చాయ్ గ్లాస్ ఉన్నట్లు గుర్తించారు. ఇది చూసి షాకైన డాక్టర్లు… ఇది ఎలా వచ్చిందంటూ బాధితుడిని ప్రశ్నించారు. అందుకు ఆయన వింతైన సమాధానం చెప్పారు. చాయ్ తాగేటప్పుడు గ్లాస్ మింగానని చెప్పారు. కానీ వైద్యులు అందుకు అంగీకరించలేదు. సన్నని ఆహార నాళం నుంచి ఆ గ్లాస్ కడుపులోకి పోయే ఆస్కారం లేదంటూ వ్యాఖ్యానించారు.
కడుపులోని గ్లాస్ ను ఎండోస్కోపీ ద్వారా తొలగించే ప్రయత్నం చేశారు. కానీ విఫలమయ్యారు. చివరకు ఆపరేషన్ చేసి… చాయ్ గ్లాస్ తొలగించారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఎక్స్ రే ఫొటోలు… ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారాయి.