చిన్నాయన్ని చంపి వాళ్లే కుట్లేశారు.. నా భార్యకు భయం పట్టుకుంది: బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి

సొంత చిన్నాయన అయిన మాజీమంత్రి వివేకానందరెడ్డిని వాళ్లే చంపి, వాళ్లే కుట్లు వేశారని బీజేపీ నేత, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. వాస్తవాలు బయటపడతాయన్న భయంతో మొదట గుండెపోటుగా చిత్రీకరించి, తర్వాత గుండెల్లో పోటుగా మార్చారని విమర్శించారు. వివేకా హత్య కేసులో తనపై, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అపనిందలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో వాస్తావాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నారు.

రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విశాఖలో భూములు కొన్నారని, ఆ భూములకు మంచి ధర రావాలంటే రాజధాని అక్కడ పెట్టాలని జగన్ అనుకుంటున్నారని వివరించారు. జగన్ లాంటి దొంగ వ్యక్తి ఉంటే రాష్ట్రానిక మంచి జరగదన్నారు. పరిటాల రవిని చంపినట్లు తనన్ను చంపుతారని తన భార్య భయపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు భయపడతాం..ఏదైతే అది జరుగుతుందని చెప్పానని పేర్కొన్నారు. కేసీఆర్ రాజ్యాంగ అమలుతీరు మార్చమంటే జగన్ ఇప్పటికే మార్చేశారని తెలిపారు.

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు భారతి రాజ్యాంగం అమలవుతోందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందనేందుకు అమరావతి అంశమే కారణమని తెలిపారు. అమరావతి ఉద్యమం 800 రోజులకు చేరుకున్న సందర్భంగా రైతులకు సంఘీభావం తెలిపారు. విశాఖలో జగన్ కు భూములున్నాయని, అందుకే అక్కడ రాజధాని ప్రకటించారని వివరించారు. జగన్ అధికారంలోకి వస్తే రాజధాని విశాఖకు మారుస్తారని గతంలో తాను కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబుకు చెప్పానని, ఇప్పుడు అదే నిజమైందన్నారు. ప్రత్యేకహోదా మటన్ బిర్యానీ, ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిదన్నారు. అమరావతి రోడ్లకు రూ.20 కోట్లు ఇస్తామని కేంద్రం చెబితే సీఎం వద్దన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *