ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి రూ.5వేలు: సీఎం జగన్

ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5వేలు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.  సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్‌ జరిగినా రూ.5వేలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసంద్భంగా అధికారులతో జగన్ మాట్లాడుతూ.,‘‘గతంలో సిజేరియన్‌ జరిగితే రూ.3వేలే, దీన్ని రూ.5వేలకు పెంచాలి. సహజ ప్రసవం అయినా, సిజరేయన్‌ అయినా తల్లిబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి, ఒకే మొత్తాన్ని ఇవ్వాలి.  సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సహజ ప్రసవంపై అవగాహన, చైతన్యం నింపాల్సిన బాధ్యత వైద్యులదే.

నెలకు ఆరోగ్య శ్రీ కింద కనీసంగా రూ.270 కోట్లు ఖర్చు చేస్తున్నాము.  104,108 కోసం నెలకు కనీసంగా రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నాము.  ఆరోగ్య ఆసరా కింద నెలకు కనీసంగా రూ.35 కోట్లు ఖర్చుచేస్తున్నాము.  అంటే కేవలం ఆరోగ్యశ్రీ, దానికింద కార్యకలాపాలకోసం ఏడాదికి దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి. గత ఏడాది ఆయుష్మాన్‌భారత్‌ కింద రూ.223 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది రూ.360 కోట్లు ఇస్తామని అంచనాగా చెప్పారు.

రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నంలలో  కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2023 నుంచి మెడికల్‌ ప్రవేశాలకోసం కసరత్తు చేస్తున్నాము. మెడికల్‌కౌన్సిల్‌ మార్గదర్శకాల ప్రకారం చేయాల్సిన పనులు వేగంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము.  ఇక్కడ డిసెంబర్‌నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. మిగిలిన చోట్ల కూడా నిర్మాణాలు వేగవంతం చేయాలి. ఒకటి రెండు చోట్ల స్థలాలపై కోర్టు కేసులున్నాయి. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నంచేయాలి’’ అని అధికారులకు సీం ఆదేశాలు జారీ చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *