నేలపై వాలని పక్షులు.. నీరు, ఆహారం కూడా అక్కడే!
Birds: మన చుట్టూ ఎన్నో రకాల పక్షులను చూస్తూ ఉంటాం. అవి గాలిలో ఎగురుతాయి. అప్పుడప్పుడు దాహం, ఆకలి, విశ్రాంతి కోసం కిందికి వస్తాయి. కానీ ఓ పక్షి మాత్రం వాటికి పూర్తిగా విభిన్నంగా ఉంది. అసలు అది నేలపై వాలనే వాలదు. ఇంతకు ఆ పక్షులు ఏంటి.. వాటి అసలు రహస్యం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ పక్షి చూడటానికి పావురంలా ఉంటుంది. కానీ దీని రంగు మాత్రం చిలుకలా ఉంటుంది. ఈ పక్షి మన ఇండియాలో, ఉత్తర ప్రదేశ్ లో ఎక్కువగా ఉంటాయి. మహారాష్ట్రలో ఈ పక్షులు అంతగా కనిపించవు కానీ.. ఆ రాష్ట్ర పక్షి ఇదే. మరాఠి భాషలో హరోలి అని పిలువబడుతుంది. ఇవి ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ లో కూడా కనిపిస్తాయి.
చూడటానికి పావురం పోలికలతో ఉన్నా.. ఇవి పావురాలు లాగా గింజలు తినవు. మొగ్గలు, ధాన్యాలు వంటి వాటిని తింటాయి. గుంపులు గుంపులుగా పైకి ఎగురుతాయి కానీ.. నేలపై అస్సలు వాలవు. వీటిని పగలే చూడడానికి వీలుగా ఉంటాయి. పగటి సమయంలో ఇవి దట్టమైన అడవిలో అతిపెద్ద చెట్లపైన కనిపిస్తాయి. ఇవి చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. చిన్న చిన్న గడ్డిపరకలు ఆకులతో గూళ్లు నిర్మించుకుంటాయి.
ఈ పక్షులకు నేలపైకి రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆహారం కోసం పండ్లను తింటున్నాయి. నీటి కోసం కూడా ఇవి చెట్ల పైనే ఆధారపడుతుంటాయి. పండ్లలో ఉండే నీటిని తాగుతాయి. అంతేకాకుండా చెట్ల పై బడే మంచు నుంచి తయారయ్యే నీటి బిందువులను ఈ పక్షులు తాగుతూ అలా బ్రతికేస్తున్నాయి.