తెలుగు బిగ్‌బాస్‌ తొలి మహిళా విజేతగా నిలిచిన బిందు మాధవి

తెలుగు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజ‌న్ విన్న‌ర్‌గా హీరోయిన్ బిందు మాధవి నిలిచింది. శ‌నివారం రాత్రి జ‌రిగిన ఫైనల్ షోలో బిందు మాధ‌విని షో వ్యాఖ్యాత నాగార్జున అక్కినేని విన్న‌ర్‌గా ప్ర‌క‌టించారు. బుల్లి తెర‌పై ప్ర‌సార‌మైన‌ బిగ్ బాస్ ఐదో సీజ‌న్‌లో ఆక‌ట్టుకున్న అఖిల్ సార్థ‌క్ నుంచి గ‌ట్టి పోటీ ఎదురైనా చివ‌రకు బిందు మాధ‌వి విజేత‌గా నిలిచారు. వెర‌సి బిగ్ బాస్ తెలుగు వెర్ష‌న్‌లో ఓ మ‌హిళ బిగ్ బాస్ విన్న‌ర్‌గా నిల‌వ‌డం ఇదే తొలిసారి.

Bindu Madhavi lifts the trophy of Bigg Boss Non-Stop

ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ బిగ్‌ రియాల్టీ షోకు శనివారం (మే 20) శుభం కార్డు పలికారు. 83 రోజులు జరిగిన ఈ షోలో టాప్ 7 కంటెస్టెంట్స్‌గా బాబా భాస్కర్‌, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్‌ సార్థక్, బిందు మాధవి నిలిచారు. టాప్ 5 కంటెస్టెంట్స్‌కి, ఎక్స్ హౌస్ మేట్స్‌కి అవార్డ్స్ ఇవ్వడానికి ‘మేజర్’ టీమ్‌ని స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. హౌస్ మేట్స్‌కి తమ క్యారెక్టర్‌ని బట్టి ఫన్నీ అవార్డ్స్ ఇచ్చారు. అనంతరం టాప్ 4 కంటెస్టెంట్ కి సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ చేయగా.. అరియనా తీసుకుంది. ఆ సూట్ కేస్ లో రూ.10 లక్షలు ఉన్నట్లు చెప్పారు నాగార్జున. దీంతో అరియనా ఎగిరి గంతేసింది. టాప్ 3 లో ఉన్న అఖిల్, బిందు మాధవి, శివలలో ఒక బాంబ్ టాస్క్ పెట్టి శివను ఎలిమినేట్ చేశారు. ఫైనలిస్ట్ లైన అఖిల్, బిందు మాధవిలకు ఒక ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్. ఇద్దరికీ గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ ఇచ్చారు. అందులో విన్నింగ్ అమౌంట్ లో కొంత ఉందని చెప్పారు. కానీ ఇద్దరూ దానికి ఒప్పుకోలేదు. దీంతో అఖిల్, బిందులను తీసుకొని స్టేజ్ పైకి వెళ్లారు నాగార్జున. ఇద్దరికీ ట్రోఫీ చూపించారు. ఫైనల్ గా బిందుని విన్నర్‌గా అనౌన్స్ చేశారు.

https://www.instagram.com/p/Cd0c65cPU05/

‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’లో మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకొన్నారు బిందు మాధవి. ఎక్కువగా శివ అండ్‌ -కోతో కనిపించిన ఆమె, ఆట కోసం కొన్నిసార్లు అదిరిపోయే ట్విస్టులు ఇచ్చేవారు. తనని నామినేట్‌ చేసిన వారికి కాస్త గట్టిగానే సమాధానం చెప్పేవారు. ఇక అటు ఫిజికల్‌ గేమ్స్‌, ఇటు మైండ్‌ గేమ్స్‌లోనూ తన స్ట్రాటజీని ఉపయోగిస్తూ తోటి కంటెస్టెంట్‌లను ఇరుకున పెట్టేవారు. ఒకానొక దశలో నటరాజ్‌ మాస్టర్‌-బిందుమాధవిల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అప్పుడు కూడా సహనం కోల్పోకుండా బిందు మాధవి వ్యవహరించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు, తమిళంలో అధికంగా బిందు మాధవికి గుర్తింపు ఉండటంతో అక్కడి ప్రేక్షకుల ఓట్లు కూడా కలిసొచ్చాయి. అలా ఈ సీజన్‌ విజేతగా బిందు మాధవి నిలిచారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *