దేవుడికి నోటీసులు ఇచ్చిన కోర్టు.. ఎందుకంటే…!
మనలో చాలా మంది దేవుడ్ని నమ్ముతారు. మరి కొందరు నమ్మరు. కానీ ఎవరి విశ్వాసాలు వారివి. ఉన్నాడు అని కొందరు వాదిస్తారు. లేరు అని మరి కొందురు వాదిస్తారు. ఏదైమైనా కానీ ఎవరి వాదనను కొట్టిపారేయలేము. అందుకే చాలా మంది దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు అంటారు. లేడు అంటే.. లేడు అని అంటారు. దీనికి ప్రధాన కారణం వారితో వాదించలేక. ఇదిలా ఉంటే ఓ కోర్టు శివుడు అనే దేవునికి సమన్లు జారీ చేసింది. విధింగా కోర్టుకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. లేకపోతే ఆ శివుడు మీద పది వేల వరకు జరిమాన వేస్తామని ప్రకటించింది. ఇది వినేందుకు వింతగా ఉన్నా కానీ నిజం. ఈ ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగింది. ఇంతకీ ఏం జరిగింది అనేది ఓ సారి చూద్దాం.
మనిషి నమ్మే కనిపించని శక్తులకు కోర్టులు నోటీసులు ఇస్తున్నాయి. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ ఘడ్ జిల్లాలో జరిగింది. ఇంతకీ ఏం జరిగింది అంటే స్థానికంగా ఉంటే ఉండే ఓ ఆలయం అక్రమంగా కొందరు ఆక్రమించిన భూమిలో కట్టారు అని ఓ మహిళ బిసిలాపుర్ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సుమారు 10 మందికి నోటీసులు జారీ చేసింది. వీరు అంతా కోర్టుకు అటెండ్ అవ్వాలని ఆదేసించింది. లేకపోతే జరిమాన తప్పదని హెచ్చరించింది. ఇందులో ఆ గుడిలోని శివుడు కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.
దేవునికి కోర్టు నోటీసులు ఇవ్వండం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కావాలంటే కోర్టు వారు ఆలయ ధర్మకర్తలకు నోటీసులు ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే చట్టం ముందు ఎంతటి వారు అయినా ఒకటే అని అంటున్నారు న్యాయవాదులు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో ఓ రేంజ్ లో చక్కెర్లు కొడుతుంది.