అనిల్‌కి బిగ్‌ బాస్‌ షాక్‌.. అరియానాకి సీక్రెట్‌ టాస్క్…!

అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టు.. చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల కొట్లాటలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో భావోద్వేగాలతో కూడిన ప్రయాణమే బిగ్ బాస్ షో. అందుకే ఈ షో బుల్లితెరపై బాగా పాపులర్‌ అయింది. ఇక తెలుగులో తాజాగా ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతోంది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి.

https://twitter.com/DisneyPlusHSTel/status/1503957965476311044?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1503957965476311044%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fbigg-boss%2Fbigg-boss-ott-telugu-anil-rathod-captaincy-cancelled-26070

ఇక ఇప్పుడిప్పుడే ఆట రంజుగా మారుతోంది. వారియర్స్‌, చాలెంజర్స్‌ అంటూ కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టిన బిగ్‌బాస్‌ ఆ అడ్డుగోడను తొలగించేశాడు. దీంతో హౌస్‌మేట్స్‌ గొడవలు మాని కొంత కూల్‌ అయ్యారు. అలాగే బిగ్‌బాస్‌ రూల్స్‌ను కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. చాలామంది పగటిపూట నిద్రించకూడదన్న రూల్‌ బ్రేక్‌ చేశారు. కొందరు పాత కంటెస్టెంట్లు మైక్‌ పెట్టుకోవడం కూడా మర్చిపోతున్నారు. దీంతో బిగ్‌ బాస్‌ కెప్టెన్ అనిల్‌ని ‘ఇంట్లో మీ కెప్టెన్సీ ఎలా సాగుతుంది’ అని అడుగుతారు. అంతా బాగుందని చెబుతాడు అనిల్. హౌస్ మేట్స్ కూడా నేర్చుకుంటూ చేస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు.

ఇంతలో బిగ్ బాస్ అనిల్ కెప్టెన్సీలో హౌస్‌లో సభ్యులు ఎలా ఉన్నారో వీడియోలో చూపించారు. అందులో కొందరు హౌస్ మేట్స్ రూల్స్‌ పాటించకుండా ఫన్నీగా ఉన్న ఈ వీడియో చూసి హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ అనిల్‌కి షాకిచ్చాడు. కెప్టెన్‌గా అనిల్ పనితీరు నచ్చకపోవడంతో అతడిని కెప్టెన్ పదవి నుంచి తీసేశారు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ అరియానాకు సీక్రెట్ టాస్క్ ఒకటి ఇచ్చారు. మరి ఆమె టాస్క్‌ని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసి కెప్టెన్ అవుతుందో లేదో చూడాలి!

Add a Comment

Your email address will not be published. Required fields are marked *