ఆ చిన్నారుల స్నేహానికి సోషల్ మీడియా ఫిదా..!
అమ్మా, నాన్న, బంధువులు ఇలా చాలా మందిని దేవుడు ఇస్తాడు.. కానీ ఒక మంచి ఫ్రెండ్ ను మాత్రం మనమే వెతుక్కోవాలి అని ఓ సినిమాలో డైలాగ్. దీని మంచి మిత్రుడు దొరకాలి అంటే చాలా కష్టం. ఇంకా చెప్పాలి అంటే అలాంటి మిత్రులు దొరికితే వదులు కోకూడదు. అందుకే స్నేహానికి అంత గొప్ప విలువ. ఇదే స్నేహం అనేది చిన్న వయసులో అయితే మరింత గొప్పగా ఉంటుంది. మన మిత్రుడు మన నుంచి ఏం ఆశించడు. వాడికి కేవలం నవ్వు ఒక మిత్రునివి గానే చూస్తాడు. నీకు ఉన్న ఆస్తి, అంతస్తు, ధనిక, పేద ఇలాంటివి అన్నీ వాడి దగ్గర ఏం ఉండవు. అందుకే స్కూల్ ఏంజ్ లో ఉండే స్నేహానికి ఖరీదు కట్టలేం అంటారు.
ఇలాంటి గొప్ప స్నేహానికి మచ్చుతున్నక ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సిగ్నల్స్ దగ్గర వస్తువులు అమ్మె కొంతమందిని మనం తరుచూ చూస్తూనే ఉంటాం. మరి కొందరు అయితే వాహనాలు ఆగినప్పుడు వచ్చి కారును శుభ్రం చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే అలానే ఓ పిల్లాడు కూడా ఓ కారు దగ్గర వచ్చి తుడిచాడు. అంతలోనే కారు వెనక భాగంలో ఉన్న మరో చిన్నారి ఆ బాలుడికి తన దగ్గర ఉండే ఓ ఆటవస్తువును తీసి ఇచ్చాడు. డబ్బులు ఇస్తాడు అనుకుంటే ఏకంగా ఖరీదైన ఆటవస్తువు ఇచ్చేసరికి అనంద పడ్డాడు. అయితే అది చాలా ఖరీదైంది అని భావించి తిరిగి ఇచ్చేస్తుండే కారులో ఉన్న బాలుడు వద్దు నీకే అని చెప్పాడు. దీంతో ఆనంద రెండింతలు అయ్యింది.
పరిగెత్తుకుంటూ పోయిన ఆ కుర్రాడు… తాను అడుక్కుని సంపాదించిన డబ్బుతో చిప్స్ కొని తనకు బొమ్మ ఇచ్చిన మిత్రునికి తెచ్చి ఇచ్చాడు. ఇద్దరూ కలసి సిగ్నల్ పడే వరకు ఆ చిప్స్ ను కలసి తిన్నారు. అనంతరం తిరిగి వెళ్తుంటే బాధతో ఒకరికొకరు బాయ్ చెప్పుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.