15 ఏళ్లలో 500 సార్లు పాము కాటుకు గురైన వ్యక్తి…!

పాములు పగబడతాయా… ఈ ప్రశ్నకు మనకు చిన్నప్పటి నుంచి ఒక సమాధానం వినిపిస్తుంది. ఊరిలో ఉండే అమ్మా వాళ్లు.. లేకపోతే మన తాత వాళ్లు చెప్పే సమాధానం ఒకటే. కచ్చితంగా పగబడుతాయి. వాటి లెక్కలు వేరు.. నిన్ను చూస్తే గుర్తు పెట్టుకుని ఏదో ఒక రోజు కాటు వేస్తాయి. ఇలా వారికి నచ్చిన విధంగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ అబద్ధం అని పెద్ద అయ్యాక స్కూల్ కు పోయిన తరువాత టీచర్లు చెప్తారు. పాముకు అంత గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి ఉండదని ఇలా కొన్ని చెప్తారు. అయితే ఇది నిజమా.. అబద్ధమా.. అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మీరు చదివే వార్త తెలిస్తే కచ్చితంగా నిజమే అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది. నిజంగానే పగ బడుతాయా..?

Maharashtra same man was bitten by snakes 500 times in latur
Maharashtra same man was bitten by snakes 500 times in latur

మహారాష్ట్రలో లాతూర్​ చెందిన ఓ వ్యక్తిని పాములు ఇప్పటి వరుకు సుమారు ఓ ఐదు వందల సార్లు కాటేశాయి. సాధారణంగా ఒకటి రెండు సార్లు అనుకుంటే ఏమోలే అనుకోవచ్చు. కానీ కచ్చితంగా అదే వ్యక్తిని పాములు 500 సార్లు కాటు వేశాయి అంటే దీనిని ఎలా చూడాలి… ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఏంటో తెలుసుకుందాం… లాతూర్ లో ఉండే అనిల్ తుకారాం గైక్వాడ్ అనే వ్యక్తిని పాములు ఇప్పటి వరకు అంటే గత పదిహేను ఏళ్లుగా… 500 సార్లు కాటు వేశాయి.

snakebite
snakebite

ఇతను సాధారణ వ్యవసాయ కూలి. దీంతో చాలా సార్లు పొలం పనుల మీద బయటకు వెళ్తారు. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తిని పాములు కాటు వేస్తున్నాయి. వింత ఏంటి అంటే.. అతను గుంపుగా ఉన్నా సరే… పాములు కరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చి కాటు వేసి వెళ్లి పోతున్నాయి. దీంతో పాములు కచ్చితంగా పగబట్టాయి అని అర్థం అవుతుందని అంటున్నారు ఇది విన్న వాళ్లు. కానీ ఇప్పటి వరుక ఈయనకు ఏం కాకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త చాలా వైరల్ అవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *