వాట్సాప్ యూజర్లు జర జాగ్రత్త.. ఈ లింక్ క్లిక్ చేశారో మీ బ్యాంకు బ్యాలెన్స్ జీరో…!

టెక్నాలజీ పెరగడంతో ప్రతి ఒక్కరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లు చేయడం మొదలయ్యాయి. అదేవిధంగా ఇదే టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సైబర్ నేరగాళ్లు ఎన్నో రకాలుగా ఎంతో మందిని మోసం చేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసిన పరిస్థితుల గురించి మనం వినే ఉంటాం. అయితే ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఇలాంటి మోసాలకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం వాట్సాప్ ను అడ్డాగా మార్చుకుని యూజర్లను మోసం చేస్తున్నారు.

ప్రస్తుతం Rediroff.com పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరలేపుతున్నారు. ఈ లింక్ ని వాట్సప్ కి పంపించి అది విషింగ్ లింక్. క్రిస్‌మస్, న్యూఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ రివార్డ్స్ పేరుతో స్కామ్ చేయడానికి పాల్పడుతున్నారు.ఈ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా అవార్డులు రివార్డులు అందుకోవచ్చని ప్రకటిస్తూ యూజర్లకు ఆశలు కల్పిస్తున్నారు.యూజర్లు ఈ లింక్ ని క్లిక్ చేయగానే ఒక తప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో మీ సమాచారాన్ని నింపాలని సూచిస్తారు.

ఇలా మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నింటినీ తెలియజేసిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టగానే మీ వివరాలను సైబర్ క్రిమినల్స్ సర్వర్‌లో స్టోర్ అవుతాయి. ఆ వివరాలతో వాళ్లు బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మొత్తం దోచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే వాట్సాప్ చూసేవాళ్లు పొరపాటున కూడా ఈ విధమైనటువంటి లింక్ రాగానే దానిపై క్లిక్ చేయకండి. పొరపాటున ఈ లింకు క్లిక్ చేస్తే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అవ్వడం ఖాయం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *