తన నటన గురించి తానే ఓపెన్ కామెంట్స్ చేసిన అవికాగోర్!

Avika Gor: టాలీవుడ్ ప్రేక్షకులకు అవికా గోర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ. ఆపై ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ సినిమాలో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత వచ్చిన ‘సినిమా చూపిస్త మావ’ సినిమా ద్వారా ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది.

ఆ తర్వాత అవికా పలు సినిమాల్లో నటించినప్పటికీ మంచి సక్సెస్ ను దక్కించుకోలేకపోయింది. ఆ క్రమంలో కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇక అవికా గోర్ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా అవికా గోర్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.

ఆ ఇంటర్వ్యూలో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గురించి ప్రస్తావన తెచ్చి సీరియల్ లో నటించే సమయంలో తాను అంత హ్యాపీగా లేనని తెలిపింది. కొన్ని సందర్భాల్లో తనను తానే అసహ్యించుకున్న అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాకుండా స్క్రీన్ లో చక్కగా కనిపిస్తున్నానా లేదా.. అనే విషయం కూడా పట్టించుకునేదాన్ని కాదు అని తెలిపింది అవికా గోర్.

ఇక అవికా గోర్ తన అందం పై మరింత ఫోకస్ పెంచింది. ఇదివరకు బొద్దుగా ఉండే అవికాగోర్ ఇప్పుడు స్లిమ్ గా తయారయింది. ఎప్పటికప్పుడు తన పోస్టులను ఇన్ స్టాగ్రామ్ లో అప్ డేట్ చేస్తూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *