వాళ్ళందర్నీ ఎంటర్టైన్ చేస్తే ఆమె రోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

ఈ మధ్యకాలంలో ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా చాలామంది మోడల్స్ తమ ఉపాధిని వేరే స్థాయిలో పెంచుకుంటున్నారు. తమదైన స్టైల్ లో అందంతో మెప్పించి.. చూసేవారిని ఆకట్టుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. మరి ఇదే క్రమంలో పోర్ట్ లాండ్ లో ఓ మోడల్.. రిచ్ పీపుల్స్ ను మెప్పించి రోజుకు లక్ష రూపాయలు వెనకేస్తుంది.

ఆ మోడల్ పేరు ఏరికా నార్త్. వయస్సు 24 సంవత్సరాలు మాత్రమే. ఆమె పాపులర్ మోడల్. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్ కూడా.. ఆమె మోడల్ గా యూట్యూబర్ గా కంటే మరో ట్రాక్ లో ఈజీ వే లో డబ్బు సంపాదిస్తుంది. దాన్ని అక్కడ అట్మాస్పియర్ మోడల్ అంటారు. అట్మాస్పియర్ అంటే ఆమెపై షాంపెయిన్ వర్షం కురిపిస్తారు.

సో ఆపేరు వచ్చింది. అసలు ఎరికా చేసే పని ఏమిటంటే.. ధనవంతులు చేసుకునే పార్టీలకు వెళ్లి వాళ్లను ఆనందపరచడం. వాళ్లతో పార్టీలో చేరి వాళ్లందరి ముందు డాన్స్ చేసి వారిని ఎంటర్టైన్ చేస్తుంది. అందుకు బదులుగా వారు లక్ష రూపాయలు ఇస్తారు. ఎరికా పెద్దపెద్ద కార్పొరేట్ ఈవెంట్స్, పలు ప్రైవేట్ పార్టీలలో తెగ హడావిడి చేస్తుంది. ఒక్కో పార్టీ లో ఒక్కో ఐడియాతో ముందుకు వస్తుంది.

ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆనందపరుస్తుంది. ఈ విధంగా ఎరికా మీద వద్దంటే డబ్బు కుమ్మరిస్తుంటారు. కానీ ఆమెకు ఆ డబ్బులు ఎటువంటి శాటిస్ఫ్యాక్షన్ ఇవ్వడం లేదు. నిజానికి ఇదంతా బోర్ గా భావిస్తుంది. ఆమె సంపద విలువ 7.5 కోట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎరికా తన ఇన్ స్టాగ్రామ్ లో 1.64 లక్షల ఫాలోయర్స్ తో తెగ హడావిడి చేస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *