రష్యా సేనలకు షాక్ ఇచ్చిన ఓ సామాన్య రైతు.. వీడియో వైరల్​.!

రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర యుద్దం కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పైపు చాలా వరకు భవన సముదాయాలు రష్యా సేనల దాడికి కూలిపోతున్నాయి. ఒక వైపు క్షిపణులు మరో వైపు యుద్ధ విమానాలు అటు యుద్ధ ట్యాంకులు వివిధ నగరాల్లో హల్​ చల్​ చేస్తున్నాయి. ఒక వైపు చర్చలు అంటూనే మరో పైపు దాడులు కొనసాగుతున్నాయి. అయినా కానీ ఉక్రెయిన్​ సైన్యం ఏమాత్రం తగ్గడం లేదు.

Ukraine farmers steal russian military tank people will laugh after watching this viral video
Ukraine farmers steal russian military tank people will laugh after watching this viral video

ఇదిలా ఉంటే రోజుకో వీడియో ఉక్రెయిన్​ లో జరుగుతున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టనట్లు చూపిస్తున్నాయి. అయితే కొన్ని వీడియోలు అయితే ఏకంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి తన చేతితో సైనికులను ఆపాడు. మరో పాప సైనికుని మీద  దాడి చేస్తూ.. మా దేశంలోకి ఎందుకు వచ్చారు అని అన్నది.  ఇలాంటి వీడియో మరోకటి ఇప్పుడు మనం చూద్దాం.

ఉక్రెయిన్ పౌరులు కూడా రష్యా సేనలను తిప్పి కొడుతున్నారు. తమ దైన శైలిలో వారికి ఎదురు తిరుగుతున్నారు. ఇలానే ఓ రైతు కూడా యుద్ధానికి సంబంధించి రష్యా సేనలను ఆపాడు. తన వద్ద ఉన్న ట్రాక్టర్‌ సాయంతో యుద్ధ ట్యాంకర్‌ ను ఏకంగా నిలిపి వేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్​ గా మారింది. కేవలం ఆపేయకుండా ఏకంగా ట్రాక్టర్​ సాయంతో లాక్కెళ్లి పోయాడు. దీంతో ఆ యుద్ధ ట్యాంకర్‌ను రైతు నుంచి విడిపించేందుకు రష్యా సైనికుడు ఆ ట్రాక్టర్ తో పాటు పరుగులు పెట్టారు. ఈ సన్నివేశాన్ని కొందరు తమ ఫోన్ కెమెరాలలో చిత్రీకరించగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *