‘ఫినామినల్ ఉమెన్’ డాన్స్ కు ఫిదా అయిన ఏ ఆర్ రెహమాన్!

Sandhya Rani: సంగీత డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఏదైనా విషయంలో ఫిదా అయితే మాత్రం కచ్చితంగా అది సెన్సేషనల్ గా మారుతుందని అర్థం. అలా తాజాగా ఒక డాన్స్ వీడియో పై ఆయన ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంతకు ఆ డాన్స్ వీడియో ఏంటంటే.. ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు చేసిన ఫినామినల్ ఉమెన్ డాన్స్.

Sandhya Rani
Sandhya Rani

నాట్యం సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో, తన నాట్యంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇటీవలే ఉమెన్స్ డే సందర్భంలో ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత మాయ ఏంజిలో ఇంగ్లీష్ లో ఒక పద్యం రూపంలో విడుదల చేసింది. ఇక ఆ ఇంగ్లీష్ పద్యం కు సంధ్య రాజు కూచిపూడి డాన్స్ తో అందంగా పర్ఫామెన్స్ చేసి చూపించింది.

ఇక ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారడంతో ఎన్నో లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ వీడియోను ఏ ఆర్ రెహమాన్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఇప్పటికే ఈ వీడియో మూడు లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుందని.. మన తెలుగు అమ్మాయి క్లాసికల్ డాన్సర్ జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందింది అంటే గర్వించదగిన క్షణం అంటూ తనపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *