చంద్రబాబు, జగన్ కలిసే ఏపీని నాశనం చేస్తున్నారు- బీజేపీ నేత

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తోపాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముతపడిన పరిశ్రమలను తెరవలేని వారు.. స్టీల్​ ప్లాంట్​ అంటూ ఎందుకు కలవరిస్తున్నారో చెప్పాలని అన్నారు. కేంద్రం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం సోకులు పడుతోందని ఎద్దేవా చేశారు. పథకాలకు కేటాయించే డబ్బులు మళ్లించి.. బిల్లులు ఎలా ఆపుతారని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్​లకు డబ్బులు వేశామని.. కానీ, కేంద్రం వేసిన డబ్బులను కూడా జగన్ లాగేసుకుంటున్నారని ఆరోపించారు.

ap-bjp-chief-somu-veerraju-sensational-comments-on-cm-jagan-and-chandrababu

చంద్రబాబు, జగన్​ ఇద్దరూ సిక్కర్ బాబులు.. వీళ్లతో ఏపీ అభివృద్ధి జరగడం అసాధ్యం. ఏపీ రాజధాని విషయంలో బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. అందులో ఎలాంటి డౌట్​ లేదు. రాజధాని రైతుల జీవితాలను చంద్రబాబే నాశనం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ పనులు పూర్తి చేసింటే.. ఇప్పుడు రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చేది కాదు. జగన్​ జనాలను తన మయమాటలతో ఏమార్చి మోసం చేస్తున్నారు. అని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే డిసెంబరు 28న ఏపీ ప్రభుత్వంపై పోరుబాటకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఏపీని అభివృద్ధి చేయగలిగే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. అసెంబ్లీలో బూతులు తప్ప ప్రజలకు ఉపయోగ పడే విషయాలు ఒక్కటి కూడా ప్రస్థావించట్లేదని మండిపడ్డారు. దీంతో పాటు కమ్యునిష్టులపైనా విరుచుకుపడ్డారు. దేశంలో విద్యా వ్యవస్థను కమ్యునిష్టులే నాశనం చేస్తున్నారని అన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *