సీఎం జగన్ ను ట్రోల్ కు గురి చేయిస్తున్న ఆ మూడు అశాలు..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓ మూడు అంశాల్లో సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి. మూడింటినీ పోల్చి చూపుతూ ప్రత్యర్థి పార్టీలు, ఆకతాయిలు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమూడు అంశాలు ఏంటంటారా.? మద్యం ధరలు, శాసన మండలి రద్దు, సినిమా టికెట్ల పెంపు అంశాలు జగన్ ను ట్రోల్ చేయించే అంశాల్లో ప్రధానంగా ఉన్నాయి. మద్యం అంశాన్ని తీసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధానికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నిషేధం చేయాలంటే తాగే వారికి షాక్ కొట్టేలా ఉండాలంటూ, తాగాలంటే ఐదు నక్షత్రాల హోటళ్లలో మాత్రమే దొరికేలా ఉండాలని రేట్లను రెట్టింపు చేశారు. కానీ తర్వాత ఆదాయం తగ్గడంతో నష్టాన్ని పూడ్చుకుని అమ్మకాలు పెరిగేందుకు రేట్లు తగ్గించారు. దీనిపైనా ప్రతిపక్షాలు బాగానే ఇరుకున పెట్టాయి.


తర్వాత మూడు రాజధానుల బిల్లు విషయంలో మండలిలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న పేద రాష్ట్రానికి మండలి అవసరమా..ఏటా రూ.60 కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఇలాంటి అనవసరమైంది రాష్ట్రానికి అవసరం లేదంటూ అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపారు. అయితే ఇప్పుడు దీనిపై జగన్ వెనకడుగు వేసి ఖాళీ అవుతున్న స్థానాల్లో తన పార్టీ వారిని నియమిస్తున్నారు.

సినిమా టికెట్ల విషయంలోనూ ప్రభుత్వం ఇదే పందాను కొనసాగించిందది. మొన్నటి వరకు పేద వాళ్లకు సినిమా చూపించాలన్న లక్ష్యంతోనే టికెట్ రేట్లు తగ్గించామని ప్రభుత్వ చెప్పింది. అయితే ఇటీవల టికెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు పేదల కోసం ప్రభుత్వం ఆలోచించింది, ఇప్పుడు రేట్లు పెంచింది, రెండు మూడు నెలల్లో ఏపీ ప్రజలను ధనవంతులను చేశారా ముఖ్యమంత్రి అంటూ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మద్యం, శాసన మండలి, సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం మాట మీద నిలబడలేదని పోస్టులు పెడుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *