గెటౌట్ చంద్రబాబు.. షటప్ చంద్రబాబు.. బైబై బాబు : అంబటి రాంబాబు

చంద్రబాబు నినాదం… క్విట్‌ జగన్, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని… కానీ ప్రజల విధానం ఏమిటో 2019 ఎన్నికల్లో, ఆ తరవాత ప్రతి ఎన్నికల్లోనూ చూపించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గెటౌట్‌ చంద్రబాబు… షటప్‌ చంద్రబాబు… బైబై బాబు అని ఎన్ని సార్లు చెప్పినా చంద్రబాబు నాయుడు సిగ్గు పడటం లేదని విమర్శించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ధరల పెరుగుదల అన్నది సప్లై డిమాండ్‌ మీద ఆధారపడి ఉంటుంది. కానీ హెరిటేజ్‌ స్టోర్‌లో ధర మాత్రం చంద్రబాబు జేబులోకి వచ్చే లాభం మీద ఆధారపడి మార్కెట్‌ కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. బాబు హయాంలో కందిపప్పు డబుల్‌ సెంచరీ కొడితే… ఆయిల్‌ ధరలు కూడా ఇప్పటి స్థాయికి ఏడేళ్ళ క్రితమే చేరాయి.

డీజిల్‌ కానివ్వండి… పెట్రోల్‌ కానివ్వండి… ఏ ధర తీసుకున్నా… మన పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఒక రూపాయి ఎక్కువగా ఉన్నంత మాత్రాన… దాన్ని చాలా దుర్మార్గంగా చూపిస్తున్న చంద్రబాబు బృందం… తమ హయాంలో కూడా ఇదే పద్ధతిలో ఉందని ఎందుకు చెప్పటం లేదు?  ఎంతసేపటికీ డీజిల్, పెట్రోల్‌ ధరల్లో ఉన్న ఆ ఒక్క రూపాయి… అర్ధ రూపాయి తేడా గురించి మాట్లాడే చంద్రబాబు… 2014–19 మధ్య బడ్జెట్లలో ఎంత ఆదాయం వచ్చిందో, 2019 నుంచి నేటి వరకు దాదాపు అంతే ఆదాయం వచ్చింది.

అప్పుడు లేని కొవిడ్‌ను కూడా జగన్‌  ప్రభుత్వం ఇప్పుడు అదే ఆదాయంతో ఎదుర్కొం దని చెప్పటానికి చంద్రబాబుకు ధైర్యం ఉందా? ఏపీలో ప్రజా ఉద్యమం అవసరం అని చంద్రబాబు మాట్లాడటం మరీ విడ్డూరం. ఆ ప్రజా ఉద్యమం రావటం వల్లే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గోల అంతా దత్త పుత్రుడు తాను ఇంతకు ముందు విడిపోయినట్టు ఆడిన డ్రామా ముగించటానికి మరో డ్రామా ఎలా ఆడాలా అన్నదే’’అని విమర్శించారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *