ఈ 17 ప్రశ్నలకు సమాధానం చెప్పు జగన్ : లోకేష్

సీఎం జగన్‍కు 17 ప్రశ్నలను నారా లోకేశ్ సంధించారు. చేతనైతే తన ప్రశ్నలకు సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. లోకేష్ వేసిన ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి.  ‘‘1. అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించిన నీచుడు ఎవరు?. 2. మూడేళ్ల పాలనలో చిన్న పిల్ల కాల్వ అయినా తవ్వారా?. 3. గతేడాది ధాన్యం డబ్బు రైతులకు ఇచ్చారా?, ఈ ఏడాది కొన్నారా?. 4. రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?. 5. ఇన్‍పుట్ సబ్సిడీ ఎక్కడ? 6. తుఫాన్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చారా?. 7. పంటల బీమా ప్రీమియం కట్టామన్నారు.. రైతులకు ఇన్స్యూరెన్స్ వర్తించలేదెందుకు?.

8. రూ.12,500 రైతు భరోసా ఇస్తానని, రూ.7,500 ఇస్తుంది ఎవరు?. 9. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులను గుర్తించారా?. 10. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ వంటివి ఏమయ్యాయి?. 11. వ్యవసాయరంగ వ్యతిరేక బిల్లులకు మద్దితిచ్చిన మూర్ఖుడెవరు?. 12. ఏపీ మరిచిపోయిన క్రాప్ హాలిడే మళ్లీ తెచ్చిన అసమర్థుడు ఎవరు?. 13. టీడీపీ హయాంలో రైతులకు రూ.3 లక్షల వరకు ఉన్న సున్నావడ్డీ నిబంధనను లక్షకే పరిమితం చేసిందెవరు?.

14, రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండటానికి కారకుడు మీరు కాదా?. 15. ముదిగొండలో 8 మంది రైతులను మీ తండ్రి కాల్చి చంపిన చరిత్ర మరిచిపోయారా?. 16. సోంపేటలో భూమికోసం ఆందోళన చేసిన రైతులను ఆరుగురిని కాల్చి చంపించింది మీ తండ్రి వైఎస్ కాదా?. 17. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తే టెర్రరిస్టుల్లా సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడి ఆదేశాలతో?’’ అని తీవ్రమైన ప్రశ్నలు సంధించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *