విషాదంలో యాంకర్ అనసూయ.. తండ్రి మరణంతో కన్నీరుమున్నీరు!

బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు గత కొంత కాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే నేడు ఉదయం ఆయన మరింత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలోనే అనసూయ కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.ఈ విషయం తెలుసుకున్న అనసూయ కన్నీరుమున్నీరవుతున్న వెంటనే తన షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని తన తండ్రి ఆఖరి చూపుల కోసం బయలుదేరింది.

అనసూయ తండ్రి సుదర్శనరావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కీలక పాత్ర వహించారు.అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఈయన క్యాన్సర్ తో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు బుల్లితెర నటీనటులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పలువురు ఈమెకు ఫోన్ చేసి ఈమెను ఒదారుస్తున్నారు.

అనసూయ తల్లితండ్రులు హైదరాబాద్ లోని తార్నాకలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనసూయ తార్నాకకి బయలుదేరారు. ఇండస్ట్రీలో ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో ప్రతి ఒక్కరు ఎంతో షాక్ కి గురవుతున్నారు.శివ శంకర్ మాస్టర్, సిరివెన్నెల మరణవార్త మర్చిపోకముందే ఈ విధంగా అనసూయ తండ్రి మరణవార్త తెలియడంతో పలువురు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

One Comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *