ట్రోలర్స్‌కి అనసూయ స్ట్రాంగ్‌ కౌంటర్‌.. రచ్చ రచ్చవుతున్న ట్వీట్‌

యాంకర్ అనసూయ.. బుల్లితెర, వెండితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముక్కు సూటితనంతో పాటు తన డ్రస్సింగ్‌తో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది అనసూయ. నేడు అందరూ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటే.. ఉమెన్స్ డే పైనే సంచలన ట్వీట్ చేసి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ.

Anchor Anasuya controversy tweet on women's day

ఈ సమాజంలో మహిళలు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని ప్రోత్సహించే వారితో పాటు ట్రోల్ చేసేవారు కూడా ఉన్నారు. అలాంటి ట్రోలర్స్ అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ. ‘విమెన్స్ డే అనగానే ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ సడన్‌గా మహిళలకు గౌరవమివ్వడం గుర్తొస్తుందని.. కాకపోతే అది కొన్ని గంటల్లోనే ముగిసిపోతుందని.. కాబట్టి అలాంటివి నమ్మొద్దు. హ్యాపీ ఫూల్స్ డే’ అంటూ రాసుకొచ్చింది. ఈ సొసైటీలో మహిళలకు మర్యాద ఇచ్చే వారే లేరన్నట్లుగా అనసూయ పోస్ట్ పెట్టింది.

ఇంకెముందీ… అనసూయ చేసిన ట్వీట్ తో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. మథర్ థెరిస్సా.. మెరీ కోమ్ వంటి వారిపై ఎవరు ట్రోల్ చేయరు. మనం చేసే పనుల ద్వారానే మనకు గౌరవం దక్కుతుంది అంటూ తిట్టి పోస్తున్నారు. అయితే తన గురించి వస్తున్న కామెంట్స్ చూసిన అనసూయ.. ట్రోల్స్ చేసేవారికి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గుమ్మడి కాయ దొంగలు వచ్చారు. నా ట్వీట్ కింద్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు చూడండి అంటూ మరో ట్వీట్ చేసింది. అయితే తాజాగా ఆమె చేసిన మరో ట్వీట్ పై కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన గురించి కామెంట్స్ చేసే వారిని అనసూయ బ్లాక్ చేస్తూ వస్తోంది. దీంతో అనసూయ బ్లాక్ చేస్తుంది అంటూ మళ్లీ కామెంట్స్ మొదలుపెట్టారు. మొత్తానికి అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో రట్ట రచ్చ అవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *