ఇకపై నన్ను అలా పిలవద్దు అంటున్న హీరో నాని…

తనదైన సహజ నటనతో అభిమానుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నాడు నాని. విభిన్న పాత్రలు, వైవిధ్య కధాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం నాని ” శ్యామ్ సింగ రాయ్ ” అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి “టాక్సీవాలా” దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం చేస్తున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పిరియడికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కాగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

actor nani shocking decision about star tag

ఈ మేరకు మూవీ ప్రమోషన్లలో భాగంగా నాని ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పై ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని… 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందని చురకలు అంటించారు. అలానే ఈ మేరకు ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. తన పేరు ముందు ఉన్న నేచురల్ స్టార్ అనే ట్యాగ్ ని తీసేద్దామనుకుంటున్నానని ప్రకటించారు. ఇక తనను నేచురల్ స్టార్ అని ఎవరూ పిలవద్దని కోరారు. ఇక నాని సినిమా థియేటర్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమరాన్నే రేపుతున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్, అజిత్ కూడా తమ స్టార్ ట్యాగ్స్ తో పిలవోద్దంటూ కోరిన విషయం తెలిసిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *