సూసైట్ నోట్‌ రాసి యువనటి ఆత్మహత్య..!

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ బెంగాల్ నటి పల్లవి డే మరణవార్త మరవక ముందే.. బెంగాలీ నటి బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. కోల్‏కత్తలోని తన అపార్ట్మెంట్‏లో గురువారం ఉదయం బిదిషా శవమై కనిపించింది. గత నాలుగేళ్లుగా అదే అపార్ట్మెంట్‌లో నివసిస్తున్న బిదిషా.. మే 25న ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. బిదిషా ఉరికి వేలాడుతూ కనిపించింది.

Bengali actress Bidisha De Majumdar found dead in her apartment in Kolkata

బిదిషా డి మజుందార్  ఒక ప్రముఖ బెంగాలీ మోడల్, నటిగా గుర్తింపు పొందింది. వెస్ట్ బెంగాల్ లోని కోల్‌కతాలో తన అపార్ట్‌మెంట్‌లో కొద్ది రోజులుగా నివసిస్తోంది. నిన్న అదే ప్లాట్‌లో శవమై కనిపించింది. తన చావుకు గల కారణాలను తెలుపుతూ సూసైడ్ నోట్ కూడా రాసింది. అయితే బిదిషా గత నాలుగు నెలలుగా అక్కడే నివసిస్తోంది. బరాక్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని, సూసైడ్ లెటర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బిదిషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్‌జి కర్ ఆసుపత్రికి తరలించారు.బిదిషా మరణవార్తతో బెంగాల్ సినీ ఇండస్ట్రీలో షాకయ్యింది. మోడ‌ల్ గా కెరీర్‌ను ప్రారంభించిన బిదిషా డి మజుందార్.. 2021లో ‘భార్ ది క్లౌన్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో న‌టించి మంచి గుర్తింపు పొందింది. ఈ త‌ర్వాత‌ త‌న ప్ర‌తిభ‌కు గుర్తింపుగా వ‌రుస అవకాశాలు ద‌క్కాయి. త‌న అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌దైన ముద్ర‌ను వేసుకుంది బిదిషా.

కాగా బెంగాలీ ఇండస్ట్రీలో ఒకే నెలలో ఇద్దరు యాక్ట్రెస్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరపెడుతోంది. నటీమణుల వరుస ఆత్మహత్యలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. వారం కిందనే బెంగాలీ నటి పల్లవి డే తన ప్లాట్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో నటి కూడా సూసైడ్ చేసుకోవడం సినీ లోకాన్ని షాక్ కు గురిచేసింది. ఒకే నెలలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *