మొసలికి చుక్కలు చూపించిన తాబేలు… ఏం జరిగింది అంటే?

చిన్నప్పుడు ఎప్పుడో కుందేలు, తాబేలు కథ విన్నాం కదా… దానిలో బాగా పరిగెత్తగల కుందేలు కూడా తాబేలు చేతిలో ఓడిపోతుంది. చిన్నగా అయినా సరే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లినా కానీ తాబేలు ముందుగానే విజయం సాధిస్తుంది. అందుకే తాబేలును అంత తక్కువ అంచనా వేయకూడదు. అయితే ఇలాంటి తాబేలుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ తాబేలు ఏం చేసింది? అనేది మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే స్టోరీలోకి పదండి. లేకపోతే వీడియో చూసేయండి.

viral video crocodile
viral video crocodile

మొసలి, తాబేలు ఇవి రెండూ నీటిలో కానీ, నేల మీద కానీ బతకగలవు. అయితే ఓ ప్రాంతంలో వీటికి వైరం వచ్చింది. అందుకే మొసలి తాబేలును కొరికి తినేయాలని అనుకుంది. ఎలా గోలా నమిలి పడేయాలి అని భావించింది. తాబేలు తన దగ్గరకు రాగానే గుటుక్కున నోట్లో వేసుకుంది. అంతటితో ఆగకుండా రెండు దవడల మధ్యన పెట్టుకుని కర కర నమిలేయాలి అని అనుకుంది. బాగా ట్రై చేసింది. కానీ వల్ల కాలేదు. మరో సారి ట్రై చేద్దాం అని అనుకుంది. మళ్లీ సేమ్ సీన్​ రిపీట్ అయ్యింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/scienceturkiyeofficial/?utm_source=ig_embed&ig_rid=838af7e9-6314-43dd-a65c-7de72850031d
తాబేలు ను నమిలి మింగేందుకు ఆ మొసలికి ఎందుకు వల్ల కాలేదు అని అనుకుంటున్నారా.. అక్కడే లాజిక్​ ఉంది. సాధారణంగా మొసలికి ఉండే పళ్లు చాలా పదునుగా ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం కానీ ఈ సందర్భంలో అయితే తాబేలుకు ఉండే పై డప్ప కారణంగా మొసలి నోరు నుంచి ఈజీగా తప్పించుకున్నది. కానీ తాబేలు అదృష్టం కొద్ది మొసలి మరో సారి ట్రై చేయలేదు. రెండు సార్లు కిందపడిపోవడంతోనే ఇంక ఎందుకు అని వదిలేసింది. అక్కడ నుంచి తప్పించుకున్న తాబేలు చిన్నగా గెంతుతూ పక్కన నీళ్లలోకి వెళ్లింది. ఈ వీడియోని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చాలా మంది చూశారు. ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *