ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న ఒక్క మగాడు..!

ఒక్కదానితోనే వేగలేకపోతున్నా… ఇంకోటి ఎందుకు? అంటూ డైలాగ్స్​ చెప్పే భర్తల గురించి మీరు వినే ఉంటారు. కానీ ఒకరున్నారు. ఆయన అలాంటి డైలాగ్స్ చెప్పి సరిపెట్టలేదు. ఆచరించి చూపాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురిని పెళ్లి చేసుకుని ఔరా అనిపించాడు. ముగ్గురితో కలసి ఉంటూ ఏ సమస్య లేకుండా ఎంజాయ్​ చేసేస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం అయ్యిందిరా బాబు అని.. చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. మీ ఐడియా మాకు కూడా చెప్పొచ్చుగా అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు కొంతమంది తుంటరి భర్తలు. ఇంతకీ ఈ తతంగం ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా!

congo man gets married to triplets22
congo man gets married to triplets22

డెమోక్రాటిక్​ రిపబ్లిక్​ ఆఫ్ కాంగోలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవచ్చట. అందుకే కాంగోకి చెందిన లువిజో(32) ఒకేసారి నడేగే, నటాషా, నటాలీ అనే ముగ్గురు కవలలను వివాహం చేసుకున్నాడు.  నడేగే, నటాషా, నటాలీ అనే ముగ్గురు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే వారిలో ఒకరు లువిజోని ప్రేమించారట. ఇంతవరకు బానే ఉంది కానీ.. ఆమె లువిజోని మిగతా ఇద్దరికి కూడా పరిచయం చేసిందట. ఇంక అంతే వారు కూడా లువిజోని ప్రేమించడం మొదలుపెట్టేశారు. ఈ విషయం తెలుసుకున్న మొదటి అమ్మాయి.. ఈ విషయం జీర్ణం చేసుకోవడానికి బానే టైం పట్టినట్టుంది. కానీ చివరికి వారి రక్త సంబంధం ముందు ఈ ప్రేమ ఎంత అనుకుందో ఏమోగానీ చివరికి ఒప్పుకుంది. ముగ్గురు లువిజోనే ప్రేమిద్దాం అని నిర్ణయించుకున్నారు.

ఈ విషయం తెలిసి లువిజో మొదట కంగుతిన్నాడు. తర్వాత వారి మధ్య ఉన్న ప్రేమను అర్థం చేసుకున్నాడు. ముగ్గుర్నీ పెళ్లి చేసుకోవడానికి ఫస్ట్​ తటాపటాయించినా.. చివరికి ఒప్పుకున్నాడు. ముగ్గుర్నీ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ పెళ్లికి అతడి తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. వారు లేకుండానే ఈ వివాహ కార్యక్రమం ముగిసిందట.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *