30ఏళ్ల తరువాత బయటపడిన గోస్ట్ విలేజ్… ఎక్కడంటే?
వర్షం ద్వారా వచ్చిన నీటిని ఒడిసి పట్టాలంటే వాటిని నిల్వ చేయాలంటే చెరువులు, కుంటలు, సరస్సులు, ఉండాలి. ఇంకా పెద్ద మొత్తంలో వచ్చిన వాటిని నిల్వ చేయాలి అంటే కచ్చితంగా పెద్ద పెద్ద రిజర్వాయర్లు కావాల్సి ఉంటుంది. వీటిని కట్టేటప్పుడు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి అవుతుంటాయి. దీంతో అక్కడ ఉండే ప్రజలను ఖాళీ చేయిస్తుంటారు. ఇందుకుగానూ వారికి నష్ట పరిహారం కింద కొంతమొత్తాన్ని ఇస్తుంటారు. అయితే ఇలానే స్పెయిన్ లోని ఓ జలాశయం నిర్మాణం కోసం కొంతమందిని వెకేట్ చేయించారు. వారు ఉన్న ఊరి పేరు అసెరెడో. ఆ జలాశయం పేరు ఆల్టో లిండోసో. ఈ రిజర్వాయర్ ను లోకి నీళ్లు వదిలిన తరువాత ఆ ఊరు మునిగి పోయింది.
ఇలా మునిగిపోయిన ఆ ఊరు ఇటీవల బయట పడింది. దీనికి కారణం ఆ ప్రాంతంలో వచ్చిన కరువు. దీని ద్వారా రిజర్వాయర్ లో నీరు బాగా ఇంకిపోయింది. దీంతో బయట పడిన ఆ ఊరుని ప్రస్తుతం గోస్ట్ విలేజ్ గా పిలుస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గతంలో ఎలా అయితే ఆ ఇల్లు ఉన్నదో.. అలానే ఇప్పటికీ ఉంది. అయితే ఇంట మీద ఉన్న పై కప్పులు మాత్రం గల్లంతయ్యాయి.
ప్రస్తుతం ఆ విలేజ్ అంతా కేవలం మొండి గోడలతో కనిపిస్తుంది. అయితే ఈ బురుద కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న ఇంటి గోడలు అందంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ గ్రామాన్ని చూసేందుకు ప్రజలు గట్టిగానే వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఓ పర్యటక కేంద్రంగా మారింది. కానీ కొందరికి ఇది పర్యాటక ప్రాంతంగా మారితే… మరికొందరికి మాత్రం జ్ఞాపకాలుగా కనిపిస్తుంది. గతంలో ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కొందరు దీనిని చూసి కంటతడి పెడుతున్నారు.