‘పుష్ప’ శ్రీవల్లి సాంగ్ ను ఇలా కూడా వాడుతున్నారా!

Viral Video: టాలీవుడ్ ప్రేక్షకులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ తన ప్రత్యేక యాటిట్యూడ్ తో ముఖ్యంగా చిత్తూరు యాస తో ప్రేక్షకులను మరింత మెప్పించాడు.

ఇక ఈ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో సాంగ్స్ మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ తెగ సందడి చేస్తూనే ఉన్నాయి. ఇక నెటిజన్ల నుంచి సెలెబ్రేటీలు సైతం పుష్ప సినిమాలోని పాటలకు ఆడుతూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో తెగ హడావిడి చేస్తున్నారు.

ముఖ్యంగా ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఈ పాటలో అల్లు అర్జున్ చేసిన సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. క్రికెటర్లు సైతం ఈ స్టెప్ పై బాగా ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో తాజాగా షాదాబ్‌ అలీ ఖాన్‌ అనే నెటిజన్ శ్రీవల్లి పాటకి హుక్ స్టెప్ లు వేసి ఏడుస్తున్న పాపని బజ్జో పెట్టాడు.

ప్రస్తుతం ఈ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ముచ్చటగా మరోసారి చూస్తూ.. ఆనంద పడుతూ తమకు నచ్చిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. మరి మీరెందుకు ఆలోచిస్తున్నారు మీరు ఓ లుక్కేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *