ఏంటి.. ఆ సినిమాలో అనసూయ చనిపోతుందా?

సినీ ప్రియులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ తో మంచి పాపులర్ అయిన ఈ బ్యూటీ.. మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తన అందంతో ప్రేక్షకులకు గ్లామర్ విందును వడ్డిస్తుంది. ఇక చెప్పాలంటే అనసూయ కోసమే జబర్దస్త్ షో చూసే వారు కోట్లలో ఉన్నారని చెప్పవచ్చు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇటీవల వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో మంగళం శ్రీను (సునీల్ ) భార్యగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అనసూయ రవితేజ ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తోందని తెలుస్తుంది. ఈ సినిమాలో అనసూయ డబల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఇందులో ఒక పాత్రలో మాత్రం బ్రాహ్మణ కుటుంబంలో అమ్మాయిగా కనిపిస్తుందని ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ఇక రెండో పాత్ర విషయానికి వస్తే ఈ పాత్ర ఎలా ఉంటుందన్న సంగతి ఎవరికీ తెలియడం లేదు. ఈ పాత్ర గురించి ఈ చిత్ర బృందం కొంత వరకు ప్రైవసీలో పెట్టారు. కానీ ఇందులో అనసూయ చనిపోతుందని వినిపిస్తున్నాయి.

మరి రెండో పాత్ర గురించి అనసూయ అధికారికంగా ఏమని స్పందిస్తుందో చూడాలి. రమేష్ వర్మ రూపొందిస్తున్న ఈ సినిమాకి కోనేరు హరీష్ నిర్మాత పనులు చేపట్టాడు. పోగా ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో హడావిడి చేయబోతుంది. అనసూయ సినిమా లో డబుల్ రోల్స్ చేస్తున్నందున ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అనసూయ ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *