జలపాతం దగ్గర లవ్ ప్రపోజల్.. చివరికి జరిగిందేంటంటే?

Love proposal: వన్ సైడ్ లవర్స్ తమ ప్రేమను ప్రియురాలు యాక్సెప్ట్ చేయాలని నానా రకాలుగా మంచి మంచి లోకేషన్స్ దగ్గరికి తీసుకువెళ్లి తమ మనసులోని మాట బయట పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఇదే తరుణంలో ఓ వ్యక్తి జలజల పారే జలపాతం దగ్గరికి తీసుకెళ్లి తన మనసులోని మాట చెప్పాలని అనుకున్నాడు.

Love proposal
Love proposal

కానీ అక్కడ షాక్ అయ్యే ఘటన జరిగింది. అది ఒక ఎత్తైన కొండ అక్కడి నుంచి చూస్తే పెద్ద జలపాతం కనపడుతుంది. పైనుంచి కిందకు ఒకే రకంగా పాల నురగల్లా నీరు జలజల జారుతుంది. నీటి బిందువులు గాలిలో ఎగురుతూ ఉంటాయి. ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

అక్కడికి వెళ్ళిన ఆ లవర్స్ ఆ దృశ్యాన్ని అలానే చూస్తూ ఉంటారు. ఇక ఇదే మంచి సమయం అని భావించి ఆ వ్యక్తి మోకాళ్లపై కూర్చుని.. ఆమెకు ప్రపోజ్ చేయడానికి తన పాకెట్ లో నుంచి రింగును బయటకు తీశాడు. సడన్ గా వ్యక్తి పక్కకు జారిపోయాడు. ఆ రింగ్ చేతి నుంచి జారి జలపాతంలో పడిపోయింది.

అది చూసిన ఆమె షాక్ అయింది. అలా జలపాతం వైపు చుసిన ఆమె.. అయ్యో తనను ప్రపోస్ చెయ్యడానికి ఇలాంటి ప్లేస్ కి తీసుకు రావడమే కాకుండా.. నాకోసం రింగ్ కూడా తెచ్చాడు. కానీ అది జలపాతంలో పడిపోయిందని బాధపడింది. ఇక అది పోతే పోయింది లే అతడు పడిపోకుండా ఉన్నాడు అది చాలు అని అనుకుంది.

తద్వారా ఆమెకు తనపై ఉన్న ప్రేమ అర్ధం అయింది. ఆ తరువాత అతను కంగారు పడకు జస్ట్ ప్రాంక్ చేశాను అంటూ.. జేబులోంచి అసలైన రింగును బయటకు తీశాడు. దాంతో ఆమె చాలా ఆనందపడింది. ఆమె అతడి ప్రేమను కూడా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *