నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ప్రభాస్ “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు…

బాహుబలితో పాన్​ఇండియా స్టార్​గా గుర్తింపు పొందిన ప్రభాస్​.. ఆ తర్వాత వరుసగా అన్నీ అదే రేంజ్​ సినిమాలు తీస్తూ కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధే శ్యామ్​లోనూ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాపై బారీగా అంచనాలు పెంచుతూ వస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఫొటోలు, పాటలు, టీజర్లు విడుదల చేస్తూ మరింత హైప్​ను క్రియేట్ చేసింది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్​లో జోరు పెంచింది. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ప్రేమకథగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

ఇందులో భాగంగానే నేడు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఒక్కో విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను టాలెంటెడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి హోస్ట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. అలానే ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి తో పాటు ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న దర్శకులంతా హాజరు కానున్నారని సమాచారం. ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను మూవీ యూనిట్ షేర్ చేసింది. నేషనల్ లెవెల్ లో జరగనున్న ఈ ఈవెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఈ సినిమాతో పాటు, ప్రభాస్​ సలార్​, ఆదిపురుష్​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ పూర్తయింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *