Ys Jagan: విశాఖలో ప్రముఖుల నివాసాల్లో వివాహ సంబరాలు.. హాజరు కానున్న సీఎం జగన్
Ys Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విశాఖ పర్యటనలో బిజీగా ఉన్నారు. అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు ఆత్మీయులకు సంబంధించిన వివాహాలకు హాజరవుతూ నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. ఈక్రమంలోనే వైసీపీ నేత, విజయనగరం జి్లా డీసీసీబీ ఛైర్మెన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహంతో పాటు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి పెళ్లికి హాజరుకానున్నారు.
విశాఖ వేదికగా అగరంగా వైభవంగా వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకానున్నారు. ఈ వేడుకకు జగన్తో పాటు అనేకమంది రాజకీయ ప్రముఖులు రానున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర మంత్రులతో సహా పలు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై విశాఖలో రెండురోజుల పాటు ఉండనున్నారు. ఆమె కూడా వెంకయ్యనాయుడు మనవరాలి రిసెఫ్షన్కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీకి చెందిన ప్రముఖులతో పాటు… ఇతర పార్టీల వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ వేడుకకు తరలి వస్తున్నట్లు సమాచారం. దీంతో విశాఖ మొత్తం రాజకీయ సందడి నెలకొననున్నట్లు కనిపిస్తోంది.మరోవైపు ఏపీ గవర్నర్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని పరామర్శించారు జగన్. వీలైనంత విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. కాసేపు ఇద్దరూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు ఏపీలో ఇటీవలే సంభవించిన వరదలపైనా ముచ్చటించారు. ఈ వరదల కారణంగా పంట, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. చాలా కుటుంబాలు తలదాచుకోడానికి ఇళ్లులేక సతమతమైపోతున్నాయి.