ఈ పోస్టాఫీసు స్కీమ్ ద్వారా సులభంగా మీ డబ్బులు రెట్టింపు చేసుకోండి.. ఎలాగంటే?
ఇప్పటికే పోస్టాఫీసు ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. ఈ పోస్టాఫీసు స్కీమ్ ద్వారా చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తం వరకు డబ్బులను డిపాజిట్ చేసుకుంటూ పొదుపు చేసుకోవచ్చు. ఇందులో డబ్బును పొదుపు చేయడం వల్ల మన డబ్బు గురించి మనం ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పోస్టాఫీసు స్కీమ్ ద్వారా డబ్బులను మనం సేవింగ్ చేస్తే వాటిని 10 సంవత్సరాల తర్వాత రెట్టింపు శాతంలో పొందవచ్చు. ఇప్పటికే ఈ స్కీమ్ ప్రారంభం అయింది.
2020 ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ పోస్టాఫీసులో మనకు అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ పై 6.9 శాతం వడ్డీని అందిస్తుండటం గమనార్హం. అదేవిధంగా మనం ఈ స్కీమ్ ద్వారా డిపాజిట్ చేసిన డబ్బులకు ప్రతినెల వడ్డీ ని కూడా పొందవచ్చు ఈ స్కీమ్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేయాలి అంటే కేవలం వెయ్యి రూపాయల నుంచి కూడా డిపాజిట్ చేసుకుంటూ ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ కి గరిష్ట పరిమితి అంటూ లేదు. కనుక ఈ స్కీమ్ లో మీరు చేరాలి అనుకుంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసు కేంద్రాన్ని సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా మరొక అవకాశం ఏమిటంటే ఒకే అకౌంట్ పై ముగ్గురు వ్యక్తులు జాయింట్ అకౌంట్ చేసుకోవచ్చు.అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల మాత్రమే ఒక వ్యక్తి నుంచి ఈ అకౌంట్ మరొక వ్యక్తికి మార్చబడుతుంది. ఈ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణించిన అతని నామినీగా ఉన్నటువంటి వారిపై మార్చబడుతుంది.ఒకసారి ఇన్వెస్ట్ చేసిన డబ్బులను 10 సంవత్సరాల వరకు తిరిగి తీసుకోకూడదు కనుక మనం పది సంవత్సరాల తర్వాత తీసుకుంటే ప్రతి నెలా వడ్డీ పొందుతూ పది సంవత్సరాల తర్వాత రెట్టింపు డబ్బును పొందవచ్చు.