పెళ్లి ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

సాధారణంగా కొందరు వాస్తు పద్ధతులను ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే వారు చేసే ప్రతి విషయంలోనూ వాస్తును అనుసరించి చేస్తుంటారు.ఇక చాలామంది విషయంలో జాతకంలో కొన్ని దోషాలు కారణంగా వారికి వయసు పైబడుతున్న కొద్దీ వివాహ కలిసిరావు. ఈ క్రమంలోనే ఎన్నో సంబంధాలు వస్తున్నప్పటికీ పెళ్లి మాత్రం కుదరదు.ఈ క్రమంలోనే ఎన్నో రకాల హోమాలు పూజలు చేసిన ఎలాంటి ఫలితం లేకుండా చాలా బాధపడుతుంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వివాహం ఆలస్యం అయ్యేవారు ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల వివాహం తొందరగా వస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

వివాహం ఆలస్యం అయ్యేవారు వాళ్ళ పడకగదిలో ఎప్పుడు మాండరిన్ బాతుల బొమ్మలు ఉంచాలి. ఇది ఒకటి ఆడ బాతు మరొకటి మగ బాతు ఉండేలా చూసుకోవాలి. అలాగే వివాహం కాని వారు పడక గదిలో ఎల్లప్పుడు వాయువ్య దిశ వైపు తల పెట్టుకుని పడుకోవాలి. పొరపాటున కూడా దక్షిణ దిశ వైపు తల పెట్టి పడుకోకూడదు.అలాగే వారు పడకగదిని ఎల్లప్పుడు ఆశ్చర్యకరమైన లేత గులాబీ రంగులు లేదా నీలి రంగుతో అందంగా అలంకరించుకోవాలి.

వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్న వారు వారి పడకగదిలో ఉత్తర దిశ వైపు పార్వతి శివుడు ఉన్న ఫోటో లేదా రాధాకృష్ణులు ఉన్నటువంటి ఫోటోను తగిలించాలి. అలాగే పడకగదిలో ఎల్లప్పుడూ కూడా నైరుతి మూలలో పదునైన వస్తువులు అనగా కత్తి కత్తెర వంటి వస్తువులను ఉంచకూడదు.ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తప్పనిసరిగా వివాహ గడియలు కలిసి వస్తాయని తొందరగా వివాహం కుదురుతుందని పండితులు చెబుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *