రామ్ చరణ్ ‘ధృవ’ ట్రైలర్ విడుదల – Ramcharan ‘Dhruva’ Theatrical Trailer

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ధృవ’. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. అరవింద్‌స్వామి, నవదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిప్‌ హాప్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబరు 9న ‘ధృవ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *