రకుల్ ప్రీత్ ను ముద్దులతో ముంచెత్తిన రాశి ఖన్నా

టాలీవుడ్ ని ప్రస్తుతం ఓ ఊపు ఊపుతున్న హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ మరియు రాశి ఖన్నా. నవంబర్ 30 రాశి ఖన్నా పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో తనకు అత్యంత సన్నిహితులైన హీరో హీరోయిన్ లకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది రాశి. హీరోలు రామ్, రానా, నాని, వరుణ్ తేజ్, సందీప్ కిషన్, శిరీష్, హీరోయిన్లు రకుల్, లావణ్య త్రిపాఠి ఇలా అనేక మంది ఈ వేడుకలో పాల్గొని సరదాసరదాగా గడిపారు. ఆ సరదా సన్నివేశాలను ఫోటోల రూపంలో క్లిక్ మనిపించి తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచింది రాశి. తనని రాశి ముద్దులతో ముంచెత్తుతున్న ఫోటోలను ఓ అపురూప జ్ఞాపకంగా తన ఫేస్ బుక్ ఖాతా పై ఉంచింది రకుల్. ఏదేమైనా ఈ అగ్ర నాయకుల స్నేహం ఇలానే కొనసాగాలని ఆశిద్దాం. 
 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *