ఆ హీరో అభిమానానికి కంటతడి పెట్టిన స్టార్‌ డైరెక్టర్‌..!

సాధారణంగా హీరోకు ఫ్యాన్స్‌ ఉంటారు..హీరోయిన్స్‌కి ఫ్యాన్స్‌ ఉంటారు..రాజకీయ నాయకులకు ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ దర్శకునికి ఒక హీరో అభిమాని అయితే..దాని ఫలితం ఎలా ఉంటుంది? ఆయన మీద ఉన్న అభిమానం వ్యక్తీకరిస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో చూపించాడు సువీక్షిత్‌ బొజ్జా. ‘దూరదర్శిని’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న సువీక్షిత్‌ బొజ్జా దర్శకుడు సుకుమార్‌కు వీరాభిమాని. పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచిన సుకుమార్‌పై ఉన్న ప్రేమ, అభిమానంతో.. ఇప్పటి వరకు ఏ అభిమాని చేయని ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. సాధారణంగా దర్శకులపై ఓ మోస్తరు స్థాయిలో అభిమానం చూపించడం సహజమే. కానీ, తెలుగులో ఓ స్టార్ డైరెక్టర్‌ విషయంలో మాత్రం వినూత్న స్థాయిలో తన ఇష్టాన్ని ప్రకటించాడు.

Director sukumar die hard fan create a photo in his paddy field

ఈ క్రమంలోనే తన అభిమానాన్ని చాటుకునేందుకు తన స్వస్థలం కడప జిల్లా బోరెడ్డిగారి పల్లిలోని తన రెండున్నర ఎకరాల పోలాన్ని వేదికగా చేసుకున్నాడు. అందులో వరిసాగు చేస్తూ సుకుమార్‌ రూపం వచ్చేలా పంట సాగు చేశాడు. 50 రోజలు అనంతరం డ్రోన్‌తో ఈ దృశ్యాన్ని చిత్రీకరించాడు. ఇందులో సుకుమార్‌ రూపంతో పాటు ‘పుష్ప 2’ మూవీ టైటిల్‌ ఉండేలా చూశాడు. ఈ వీడియో మొత్తం పూర్తయ్యాక బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రత్యేక పాట కూడా యాడ్ చేసి సిద్ధం చేశాడు. ఈ అరుదైన దృశ్యాన్ని సుకుమార్ వద్దకు తీసుకెళ్లి ఆయన కార్యాలయంలోనే కలిశాడు.

ఆ వీడియో చూడగానే తనకు నోట మాట రాలేదని, తన కళ్లలో ఒక్కసారి నీళ్లు తిరిగాయని సుకుమార్‌ ఎమోషనల్‌ అయ్యారు. అంతేకాదు ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా? అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. సువీక్షిత్ రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *