మార్కెట్లోకి డైరెక్టుగా రామ్ చరణ్ ‘ధృవ’ పాటలు – నెల్లూరులో అభిమానుల సంబరాలు

తమిళ చిత్రం ‘తని ఒరువన్’ కు రీమేక్ గా తెలుగులో రూపొందుతున్న రామ్ చరణ్ తాజా చిత్రం ‘ధృవ’ పాటలు ఎటువంటి ఆడియో ఫంక్షన్ లేకుండా నేడు మార్కెట్లోకి నేరుగా విడుదల అయ్యాయి. పాటల విడుదల సందర్భాన్ని పురస్కరించుకుని నెల్లూరు నర్తకి థియేటర్ లో నేడు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రామ్ చరణ్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు. దర్శకులు సురేందర్ రెడ్డి. సంగీతాన్ని హిప్ హాప్ తమిళ అందించారు. ఆడియో ఫంక్షన్ నిర్వహించని ఈ సినిమాను డిసెంబర్ 2 న విడుదల చేయనున్నట్లు సమాచారం. విడుదలకు ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *