పోలీసు అధికారుల పై కక్షలు మానండి: అధికార పార్టీకి ఆప్ నేత వినోద్ హితవు

జిల్లాలో పోలీసు అధికారుల పదవులకు భద్రత కరువవుతోందని వారి పై అధికార పార్టీ నాయకులు కక్షపూరిత చర్యలను మానుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ముసునూరు వినోద్ కుమార్ పేర్కొన్నారు. తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సీఐ సీతారామయ్య పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన చర్యలు ఆపేక్షనీయం అని అన్నారు. తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్న సీఐ సీతారామయ్య ను వీఆర్ కు మంత్రి బదిలీ చేయించడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో పోలీసుల భద్రత పై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. విజయవాడలో బోండా ఉమా సైతం పోలీసుల మీద చిందులు వేసినట్లు పత్రికల్లో చూశామన్నారు. అదే విధంగా పశ్చిమ గోదావరిలో టీడీపీ నాయకులు ఒక ఎస్ఐ ని, రైటర్ ను గదిలో నిర్భందించారని, ఈ సంఘటనల నుండి ప్రజలకు అధికార పార్టీ ఏమి సంకేతాన్ని ఇస్తున్నదని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు ప్రజా అధికారుల సంక్షేమం కోసం పాటుపడాలే కానీ ఇలా వ్యవహరించడం, బదిలీలు చేయడం సరికాదని హితవు పలికారు. వీఆర్ కు బదిలీ చేసిన సీఐ సీతారామయ్య ను వారం రోజుల్లోపు యదాస్థానానికి రప్పించకుంటే తమ పార్టీ తరపున రాష్ట్ర స్థాయి దీక్షకు సిద్ధమని, ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి సైతం తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు పాల్గొన్నారు.  

Add a Comment

Your email address will not be published. Required fields are marked *