పవర్ స్టార్ కోసం స్పెషల్ ప్రమోషనల్ సాంగ్

పవన్ – త్రివిక్రమ్ కలయికల ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్తామని భావించినా.. ఇప్పుడది జనవరికి మారినట్టు సమాచారం. పవన్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా అంటే సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ ఉండేవారు. వీరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలకి అదిరిపోయే మ్యూజిక్ అందించారు దేవీ శ్రీ. అయితే, ఈసారి కొత్తగా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని తీసుకొన్నారు. తెలుగులో ఇతనికిదే తొలిచిత్రం. ఈ చిత్రంతో తనదైన మార్క్ ని చూపించాలని అనిరుద్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సినిమా కోసం పవన్ కళ్యాణ్ పై ప్రమోషనల్ సాంగ్ ని ప్లాన్ చేశాడట అనిరుద్. ఈ విషయంపై ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ ని ఒప్పించాడట. ఇప్పుడీ ప్రపొజల్ ని పవన్ దగ్గరికి తీసుకెళ్లనున్నాడు. పవన్ ఓకే అంటే ప్రమోషనల్ సాంగ్ రెడీ కానుంది. మరీ.. పవన్ ఏమంటాడో చూడాలి. పవన్ సినిమాకి స్పెషల్ ప్రమోషన్ అవసరం లేదు. సినిమాలో పవన్ లుక్స్ లని ఒకట్రెండు వదిలితే చాలు. సింపుల్ సిటీని పాటించే పవన్.. ఇలాంటి ప్రమోషనల్ సాంగ్ కి ఓకే చెప్పాడని గట్టిగా చెబుతున్నారు ఆయన అభిమానులు. మరీ.. సినిమా ప్రమోషనల్ సాంగ్ విషయంలో పవన్ నిర్ణయం ఎలా ఉండనుందనేది చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *