పవన్ కళ్యాణ్ 2000 నోటు పరిశీలన సినిమా టైటిల్ సాంగ్ కోసమేనా

జనసేన అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రూ.2000 నోటుకు పరీక్ష పెట్టాడు. ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్‌ చేతికి రూ.2000 నోటు చిక్కింది… ఆ నోటును నిశితంగా పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌… రూ.100 నోటును కూడా పట్టుకుని… రూ.2000, రూ.100 నోట్లను పక్కపక్కన బెట్టి వాటి మధ్య ఉన్న తేడాను క్షుణ్ణంగా పరిశీలించారు. పవన్‌ కరెన్సీని పరిశీలిస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాగా ఈ పరిశీలన ‘కాటమరాయుడు’ చిత్రం కోసమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చిత్రంలోని సన్నివేశాల చిత్రీకరణలో భాగంగానే నోట్ల పరిశీలన చేసారని, చిత్రంలోని టైటిల్ సాంగ్ లో ఈ నోట్లకు సంబంధించిన ప్రస్తావన పవన్ కళ్యాణ్ తీసుకురానున్నట్లు సమాచారం.
‘కాటమరాయుడు’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగ తమ్ముళ్ళ పాత్రలో శివబాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు నటిస్తున్నారు. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తుండగా, శరత్‌ మరార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మార్చి 29న సినిమా రిలీజ్‌ చేయనున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *